గత కొంత కాలంగా నందమూరి హీరోలు బాబాయి బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్‌ల మద్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయం నిజమే అని పలు సందర్బాల్లో వెళ్లడైంది. బాబాయి బాలయ్య విషయంలో ఎన్టీఆర్ కాస్త మెతక వైఖరీతో ఉన్నా బాలకృష్ణ మాత్రం అబ్బాయి ఎన్టీఆర్ విషయంలో పలు సందర్బాల్లో ఆగ్రహంను వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్‌ను పట్టించుకోని విధంగా బాలయ్య మాట్లాడాడు.
బాబాయి తనను పట్టించుకోనప్పుడు తాను ఎందుకు ఆయన్ను పట్టించుకోవాలి అనుకున్నాడో ఏమో కాని తన ‘జై లవకుశ’ చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించి బాబాయి బాలయ్యకు షాక్ ఇచ్చాడు. ఇప్పటికే బాలయ్య తన తాజా చిత్రం ‘పైసా వసూల్’ను సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లుగా వెల్లడి చేసిన విషయం తెల్సిందే. అయితే బాబాయికి కేవలం వారం రోజుల ముందు ఎన్టీఆర్ రావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
భారీ అంచనాలున్న ‘జై లవకుశ’ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌తో కనీసం రెండు వారాల పాటు ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉంది. సినిమా సక్సెస్ అయితే మరే సినిమాకు కూడా ఎన్టీఆర్ రెండు వారాల వరకు ఛాన్స్ ఇవ్వడు. బాలయ్యను ఢీ కొట్టేందుకే ఇలాంటి నిర్ణయాన్ని ఎన్టీఆర్ అండ్ బ్రదర్ కళ్యాణ్ రామ్‌లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య తమపై ప్రకటించిన యుద్దంకు ఇది కౌంటర్ అని నందమూరి ఫ్యాన్స్‌లో కొందరు భావిస్తున్నారు. మొత్తానికి దసరాకు నందమూరి హీరోలు దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తుంది.
