ఎన్టీఆర్‌ బాగా కథలు పడుతున్నాడుగా..!

ఎన్టీఆర్‌ మంచి నటుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్టీఆర్‌ వెండి తెరపై అద్బుతమైన నటనను ఎన్నో సార్లు చూపించాడు. అయితే ఇప్పుడు నిజంగా కూడా నటిస్తున్నాడు. తాజాగా ‘బిగ్‌బాస్‌’ షోకు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ నేడు జరిగింది. ఆ ప్రెస్‌మీట్‌లోనే ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఆయన అభిమానులతో పాటు పలువురు కూడా ఎన్టీఆర్‌ కథలు పడుతున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నాడు.

ఈనెల 16 నుండి ‘బిగ్‌ బాస్‌’ షోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఆ సెలబ్రెటీలు ఎవరు అంటూ సోషల్‌ మీడియాలో తారా స్థాయిలో చర్చ జరుగుతుంది. పలువురు పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. ఆ సెలబ్రెటీలు ఎవరు అనేది ఎన్టీఆర్‌కు కూడా తెలియదట. స్వయంగా ఎన్టీఆర్‌ ఈ విషయాన్ని చెప్పాడు. ఇప్పటికే రెండు టీజర్‌ల సమయంలో తాను ఎవరా సెలబ్రెటీలు అంటూ ప్రశ్నించారు.

మాటీవీ వారు ఆ సెలబ్రెటీలు ఎవరు అంటే మాత్రం చెప్పడం లేదు. నన్ను కూడా వారు సర్‌ప్రైజ్‌ చేయాలని భావిస్తున్నట్లున్నారు అంటూ ఎన్టీఆర్‌ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తుంది. షోలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనేది ఎన్టీఆర్‌కు తెలియకుండా ఉండదని, ఎన్టీఆర్‌ ఓకే చెప్పిన వారిని మాత్రమే షోలో ఉంచుతారని, ఎన్టీఆర్‌కు తెలియకుండా మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఎన్టీఆర్‌ అబద్దం ఆడుతున్నాడని కొందరు అంటున్నారు.

To Top

Send this to a friend