రక్తచరిత్ర మాదిరిగానే ఎన్టీఆర్‌ చరిత్ర..!

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్మ ఇప్పటికే ఒక పాటను అన్నగారుపై రెడీ చేశాడు. ఇక స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. స్క్రిప్ట్‌ రిత్యా సినిమాను రెండు పార్ట్‌లుగా తెరకెక్కించాలని వర్మ భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. గతంలో రామ్‌గోపాల్‌ వర్మ ‘రక్త చరిత్ర’ను రెండు పార్ట్‌లుగా తెరకెక్కించాడు. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను కూడా రెండు పార్ట్‌లుగా తెరకెక్కించే అవకాశం ఉంది.

మొదటి పార్ట్‌లో ఎన్టీఆర్‌ సినీ జీవితం, పొలిటికల్‌ ఎంట్రీ, ఇక రెండవ పార్ట్‌లో ఎన్టీఆర్‌ ఎలా సీఎం అయ్యారు, ఆ తర్వాత ఎలా పార్టీ నుండి దూరం అయ్యారు అనేది వర్మ చూపిస్తాడని ప్రచారం జరుగుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను వర్మ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తాడా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఒక వర్గం వారు మాత్రం ఈ సినిమాపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ సినిమా అంటే పలు వివాదాస్పద అంశాలు ఉంటాయి. ఆ అంశాలను వర్మ ఎలా డీల్‌ చేస్తాడు. ఉన్నది ఉన్నట్లుగా చేసినా కష్టమే, మార్చి చూపించినా కష్టమే. అందుకే వర్మ వాటిని ఎలా డీల్‌ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సంవత్సరంలో రెండు పార్ట్‌లు విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను పోషించబోతున్నది ఎవరు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. బాలయ్య పోషిస్తాడా లేక మరెవ్వరైనా ఆ పాత్రను చేస్తారా చూడాలి.

To Top

Send this to a friend