ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ డే వచ్చేసింది

ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం మరో పది రోజుల్లోనే రాబోతుంది. ఎన్టీఆర్‌ను బుల్లి తెరపై చూసే సమయం రానే వచ్చింది. స్టార్‌ మాటీవీలో ప్రసారం కాబోతున్న బిగ్‌బాస్‌ షోకు సంబంధించిన డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ మొదటి సారి బుల్లి తెరపై కనిపించనున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో అంతా కూడా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ మరియు టీజర్‌ షోపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈనెల 16న ‘బిగ్‌ బాస్‌’ షో షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. 12 మంది సెలబ్రెటీలు, 70 రోజులు, ఒక పెద్ద హౌస్‌లో ‘బిస్‌బాస్‌’ షో షూటింగ్‌ ఉంటుంది. ఆ 70 రోజులు కూడా ఆ సెలబ్రెటీలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటూ అనుక్షణం 60 కెమెరాలతో చిత్రీకరిస్తూ ఉంటారు. వారి యొక్క ప్రతి ఫీలింగ్‌ను కూడా కెమెరాల్లో బంధిస్తూ ఉంటారు.

ఆ ఇంట్లో సెలబ్రెటీల మద్య జరుగుతున్న సంభాషణలు మరియు వారి మద్య జరిగే సంఘటనలను ఎన్టీఆర్‌ మానిటర్‌ చేస్తూ షోను నిర్వహిస్తూ ఉంటాడు. ఇప్పటికే హిందీలో సూపర్‌ హిట్‌ అయిన బిగ్‌ బాస్‌ షో ఇటీవలే తమిళంలో ప్రారంభం అయ్యింది. కమల్‌ హాసన్‌ తమిళంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో తప్పకుండా ప్రేక్షకులు ఈ షోను ఆధరిస్తారనే నమ్మకంతో స్టార్‌ మా వారు ఉన్నారు. దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ షోను నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

To Top

Send this to a friend