బిగ్‌బాస్‌ షోకు ఎన్టీఆర్‌..!

హిందీ ప్రేక్షకుల అభిమానం చురగొన్న ప్రముఖ టెలివిజన్‌ షో బిగ్‌ బాస్‌ రియాల్టీ షోను తెలుగులో తీసుకు వచ్చేందుకు మాటీవీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే కౌన్‌ బనేగా కరోడ్‌పతిని తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంగా తీసుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మాటీవీ ఇప్పుడు బిగ్‌బాస్‌ షోను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి భారీ టీఆర్‌పీ రేటింగ్‌ను పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ఎన్టీఆర్‌ను అప్రోచ్‌ అవ్వడం జరిగింది.

బిగ్‌బాస్‌ షోను ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్‌ హోస్ట్‌ చేశారు. సల్మాన్‌ ఖాన్‌ కూడా ఒక సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు అచ్చు అదే తరహాలోనే తెలుగులో తీసుకు రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగులో కూడా మంచి ఆధరణ ఉంటుందనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చాడు. ఇందుకోసం ఎన్టీఆర్‌ భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

బిగ్‌ బాస్‌ షో మొదటి సీజన్‌ చిత్రీకరణ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బుల్లి తెరపై ఇలాంటి ప్రయోగం చేయిన ఎన్టీఆర్‌ సక్సెస్‌ అవుతాడా అనేది చూడాలి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల అయిన తర్వాత ఈ బిగ్‌బాస్‌ షో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే తెలుగు బిగ్‌బాస్‌ షో ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ ఇవ్వనున్నారు.

To Top

Send this to a friend