ఎన్టీఆర్ అలా చేస్తాడనుకోలేదు..

టెంపర్ సినిమా.. నటుడిగా ఎన్టీఆర్ ను ఓ ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ చిత్రానికి కథను అందించిన రచయిత వక్కంతం వంశీ కూడా ఈ కథకు ఇంత పాపులరిటీ వస్తుందని అనుకోలేదట.. అస్సలు నెగెటివ్ పోలీస్ పాత్రను ఎన్టీఆర్ చేస్తాడని అనుకోలేదని వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నటుడిగా అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ వల్లే టెంపర్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ కి ఈ కథ చెప్పగానే ఓకే చెప్పి నటించేశాడు.

టెంపర్ కథ ఇప్పుడు నవలగా రాబోతోంది. కథను, సినిమాలో చెప్పని ఎన్నో విషయాలను నవలగా వక్కంతం వంశీ రూపొందించాడు. ఈ కథను నచ్చి ప్రఖ్యాత హ్యారీ పోటర్ వంటి పుస్తకాలు ప్రచురించిన ప్రఖ్యాత అంతర్జాతీయ ‘బ్లూమ్స్ బెర్రీ’ ప్రచురణ సంస్త ఈ నవలను ప్రచురిస్తోంది. ఒక తెలుగు సినిమా కథ పుస్తకరూపంలో అందులో ఇంగ్లీష్ నవలగా అంతర్జాతీయంగా విడుదల అవుతుండడంతో వక్కంతం వంశీ పేరు, తెలుగు చిత్ర పరిశ్రమ పేరు అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది.

టెంపర్ చిత్రంలో దయా పాత్ర ఎంతో సందేశాత్మకమైనది… మానవతా విలువలు, మానవీయ భావోద్వేగాలను చర్చకు పెట్టేందుకు ఈ సినిమా ఎంతో అవకాశం కలిగించింది. హీరో పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎన్టీఆర్ కమిటెడ్ గా నటించి రక్తికట్టించడం ఆయనలో నటనా ప్రతిభకు తార్కాణమిది..

To Top

Send this to a friend