బాలయ్య పైసావసూల్ పై ఎన్టీఆర్ ఏమన్నాడంటే

‘పైసా వసూల్’.. సెప్టెంబర్ 1న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.. బాబాయ్ బాలయ్య నటన, యాస, భాషకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీనిపై ఎంతో మంది సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. బాబాయ్ బాలయ్య సినిమా చూసి అబ్బాయి ఎన్టీఆర్ కూడా స్పందించాడు.. బాబాయ్ బాలయ్య, అటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇద్దరూ ఎన్టీఆర్ కు చాలా సన్నిహితులు.. తన బాబాయ్ ని సినిమాలో అలా సరికొత్త లుక్ లో చూసి ఎన్టీఆర్ నిజంగా స్టన్ అయిపోయారట..

అసలు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య హీరో అంటే ఈ చందంగానే క్యారెక్టరైజేషన్ ఉంటుందని అంచనా వేశాం కానీ.. బాలయ్య ఇందుకు ఒప్పుకోవడం.. పూరి స్టైల్ ను, పాత్రను అన్వయించుకోవడం .. సినిమాలో డేరింగ్ గా ఆ పాత్రను పోషించడం..నమ్మశక్యంగా లేదన్నారు. సినిమా కథా కథనంలో ఎంటర్ టైన్ మెంట్ చాలా కొత్తగా అనిపించాయని.. బాలయ్య ఇంత జోష్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నో చేస్తాడన్నారు.. బాలయ్య ఎనర్జీ చూస్తుంటే 101 సినిమాలు ఇప్పటిదాకా పూర్తి చేశాడని… ఇంకా ఆ సంఖ్య డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఎన్టీఆర్ సన్నిహితుల వద్ద వ్యాక్యానించి సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. సో పైసా వసూల్ సినిమాకు ఎన్టీఆర్ ఇచ్చిన రివ్యూ విన్నాక మనం కూడా చూసేద్దాం..

To Top

Send this to a friend