అర్జున్ రెడ్డిపై ఎన్టీఆర్ ఏమన్నారంటే..

ఇక యంగ్ టైగర్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ .. హయ్ ఎనర్జీ ఉన్న యాక్టర్ అర్జున్ రెడ్డి సినిమాను.. ఇందులో విజయ్ దేవరకొండ నటనను పొగడడం నిజంగా ఓ గొప్ప పాజిటివ్ థింగ్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అర్జున్ రెడ్డి మేనియా ప్రస్తుతం కొనసాగుతోంది. ఆ మేనియా దెబ్బకు ప్రేక్షకులు, సినీ సెలబ్రెటీలు ఫిదా అవుతున్నారు. ఇంకా ఎన్ని సంచలనాలు ఈ సినిమా సృష్టిస్తుందో చూడాలి. యూత్, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ అర్జున్ రెడ్డి సినిమా ఫ్యాన్స్ అయిపోయారు. అర్జున్ రెడ్డి పాత్రలో తమను తాము ఊహించుకొని మురిసిపోతున్న వాళ్లయితే కోకొల్లలుగా ఉన్నారు.

అలాగే అర్జున్ రెడ్డి సినిమాపై తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పాజిటివ్ గా టాక్ నడుస్తోంది. ‘‘విజయ్ దేవరకొండ విజృంభించి నటించాడని.. అసలు ఇలాంటి టాలెంటెడ్ హీరోస్ ఇండస్ట్రీకి ఇంకా ఇంకా కావాలని ’’ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. దీన్ని బట్టి కామన్ ఆడియన్స్ తోపాటు సెలబ్రెటీలలో కూడా అర్జున్ రెడ్డి పై అంచనాలు ఏమేరకు ఉన్నాయో అర్థమవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను ఏమేరకు దాటేసిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు..

To Top

Send this to a friend