ఇక పవన్‌ వంతు వచ్చేసింది


పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఆ అంచనాలు అందుకునేలా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొన్నటి వరకు సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈ చిత్రం టైటిల్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నాళ్లుగా బాలయ్య, పూరిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్‌ కోసం ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు ఏ స్థాయిలో ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా చిత్ర టైటిల్‌ను ‘పైసా వసూల్‌’ అంటూ ఫిక్స్‌ చేశారు. ఇక రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబో చిత్ర టైటిల్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా ‘రంగస్థం 1985’ అంటూ టైటిల్‌ను నిర్ణయించడం జరిగింది.

ఈ రెండు చిత్రాల టైటిల్స్‌ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడంతా కూడా పవన్‌, త్రివిక్రమ్‌ల మూవీ టైటిల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపించనున్నట్లుగా సమాచారం. అందుకు తగ్గట్లుగానే ఒక మంచి టైటిల్‌ను త్రివిక్రమ్‌ నిర్ణయించే అవకాశాలున్నాయి. త్వరలోనే ఆ టైటిల్‌ కూడా ప్రకటించాలని పవన్‌ ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

To Top

Send this to a friend