డేరాబాబా రేప్ లపై వర్మ సినిమా..


 
 
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి నాంది పలుకబోతున్నారు. ఎన్నో రేపులు, హత్యలు, ఆకృత్యాలు చేసిన   గుర్మీత్ బాబా బయోపిక్ కోసం వర్మ అతనికి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా తెలుసుకుంటున్నారట. అంతేకాకుండా రీల్ లైఫ్ డేరా బాబా పాత్రలో బాలీవుడ్ నటుడిని పెట్టాలని యోచిస్తున్నాడట వర్మ. ఈ బయోపిక్ లో డేరా బాబా నెగెటివ్ షేడ్స్ తో పాటు అతడు చేసిన మంచి పనులను కూడా చూపిస్తాడట వర్మ. ఈ ప్రాజెక్టుపై వర్మ త్వరలోనే ఓ ప్రకటన కూడా చేయనున్నాడని సమాచారం.
 

వివాదాస్పద అంశాలు, గ్యాంగ్‌స్టర్ల జీవిత చరిత్రలను సిల్వర్ స్ర్కీన్ పై చూపించే డైరెక్టర్ ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు రాంగోపాల్ వర్మ. వర్మ ఇప్పటికే వాస్తవ ఘటనల ఆధారంగా రక్తచరిత్ర, సర్కార్‌, వీరప్పన్‌, వంగవీటి చిత్రాలు తీసి తనదైన మార్కు వేసుకున్నాడు.
 

అయితే తాజాగా వర్మ డేరాబాబాపై బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నాడన్న న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నది. అత్యాచార కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్ రహీం సింగ్‌పై సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. వర్మ చూపు ఇప్పడు డేరా బాబా బయోపిక్ పై పడడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందా అన్న ఉత్కంఠ పట్టిపీడిస్తోంది.

To Top

Send this to a friend