ఆలూ..చూలు లేదు..‘ఉత్తమ్’ సీఎం అట

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దాదాపు పాతికేళ్లుగా మంత్రిగా కొనసాగిన దిగ్గజ నేత ఎవరు అంటే.. ఠక్కున సమాధానం చెప్తారు. ఆయనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి.. ఇప్పుడున్న అందరు నేతల్లో ఈవెన్ చంద్రబాబు, కేసీఆర్ లను మించి కూడా ఎక్కువ కాలం మంత్రిగా జానారెడ్డి బాధ్యతలు నిర్వహించారు. నాటి ఎన్టీఆర్ హయాం ముందు నుంచే ఆయన మంత్రివర్యులు.. అంతటి సీనియర్ నేత ఎంత బాగా మాట్లాడాలి.. కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఎవ్వరికీ అర్థం కాదు. అదో మిస్టరీ అని ఇప్పటికీ తెలంగాణ శాసనసభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సెలవిచ్చారు. అంతేకాదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని.. ఆయనకు నా మద్దతుంటుందని జానా రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది..

ఆలూ లేదు.. చూలు లేదు.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే తెలంగాణ సీఎం అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి ఘంటా బజాయించి చెబుతున్నాడు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అభ్యర్థి అయితే తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. నేను ఏదీ అడిగినా ఉత్తమ్ చేసి పెడతాడని.. అసలు నేను సీఎం కావాలని ఉన్నా ఉత్తమ్ అవుతానంటే చేసేస్తానని చెప్పాడు. ఎన్నికల తర్వాత ఉత్తమ్ ను సీఎం చేస్తామని జానారెడ్డి సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో విలేకరుల సమావేశంలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది..

అక్కడున్నది కేసీఆర్.. దాదాపు 13 ఏళ్లు రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణలో అధికారాన్ని చేపట్టాడు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలన్నీ తెలంగాణలో అమలవుతున్నాయి. నీతి అయోగ్, ప్రధాని కేసీఆర్ పాలనను మెచ్చుకుంటున్నారు. తెలంగాణ జీడీపీలో దేశంలోనే మొదటి స్థానం సంపాదించింది. తెలంగాణలోని దాదాపు 70శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలనను మెచ్చుకుంటున్నారు. ఇన్ని అనుకూలతలున్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుందట.. అంతేకాదు.. కాంగ్రెస్ గెలిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని జానారెడ్డి చెప్పడం నవ్వులపాలైంది. జానారెడ్డి సోయి ఉండి మాట్లాడాలని టీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

To Top

Send this to a friend