ఆ సినిమాను ఏం పీకలేక పోయిన అల్లు అరవింద్‌

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘రాబ్తా’ చిత్రం టాలీవుడ్‌లో చాలా ఏళ్ల క్రితం వచ్చిన ‘మగధీర’ చిత్రానికి కాపీ అంటూ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. ‘రాబ్తా’ ట్రైలర్‌ రాగానే ‘మగధీర’ నిర్మాత అల్లు అరవింద్‌ కాపీ రైట్‌ చట్టం కింద కేసు వేయడం జరిగింది. దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు కోర్టు ముందు సాక్షాధారాలతో సహా మగధీరకు రాబ్తా కాపీ కాదు అంటూ తేల్చి చెప్పారు. పైగా మగధీర సినిమానే రెండు మూడు సినిమాలకు కాపీ అంటూ కోర్టులో వాదించడంతో అల్లు అరవింద్‌ మూసుకున్నాడు.

అల్లు అరవింద్‌ ఎట్టి పరిస్థితుల్లో ‘రాబ్తా’ను విడుదల కానిచ్చేది లేదు అంటూ ఆ మద్య మీడియా ముందు బీరాలు పలికాడు. కాని తీరా ‘రాబ్తా’ సినిమా రేపు విడుదల కాబోతున్న సమయంలో సైలెంట్‌గా ఉన్నాడు. దేశ వ్యాప్తంగా మరియు ఓవర్సీస్‌లో కూడా భారీగా రేపు ‘రాబ్తా’ చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బాలీవుడ్‌లో ఈ సినిమాపై చాలా ఆసక్తి ఉంది. మంచి ఓపెనింగ్స్‌ను సినిమా రాబట్టడం ఖాయం అని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

‘మగధీర’ చిత్రం మాదిరిగానే ‘రాబ్తా’ కూడా రెండు జన్మలకు సంబంధించిన ప్రేమ కథ. గత జన్మలో కవలేక పోయిన లవర్స్‌ తర్వాత జన్మలో ఎలా కలిశారు అనేది ‘రాబ్తా’ కథాంశం. ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఒక్కరు నా భర్త అన్నట్లుగా పూర్వ జన్మ ఇతివృత్తంతో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా ‘మగధీర’కు కాపీ అంటే ఎలా అంటూ విమర్శకులు అల్లు అరవింద్‌కు గడ్డి పెడుతున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ‘రాబ్తా’ అసలు రంగు ఏంటి అనేది క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది.

To Top

Send this to a friend