‘రామయ్యా వస్తావయ్య’ లాస్‌ రికవరీ కాలేదా?


ఎన్టీఆర్‌ హీరోగా సమంత హీరోయిన్‌గా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. దిల్‌రాజు నిర్మించిన ఆ సినిమా భారీ డిజాస్టర్‌ అయ్యింది. ఆ సినిమాతో దిల్‌రాజుకు భారీగా నష్టాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఆ నష్టాలను రికవరీ చేసేందుకు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌తో దిల్‌రాజు కోసం ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ అనే చిత్రాన్ని తక్కువ పారితోషికంకు హరీష్‌ శంకర్‌ చేయడం జరిగింది. ఆ సినిమా వల్ల కూడా దిల్‌రాజు నష్టం పూడినట్లుగా లేదు. దాంతో ‘డీజే’ చిత్రాన్ని దిల్‌రాజు బ్యానర్‌లో హరీష్‌ శంకర్‌ చేయడం జరిగింది.

‘డీజే’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా కూడా కలెక్షన్స్‌ మాత్రం వీర లెవల్‌లో వచ్చాయి. ఓవర్సీస్‌ ప్రేక్షకులు ఆధరించకున్నా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాత్రం దుమ్ము దుమ్ముగా కలెక్షన్స్‌ను కుమ్మరిస్తున్నారు. అయినా కూడా హరీష్‌ వల్ల ఏర్పడిన బొక్క దిల్‌రాజుకు ఇంకా పూడినట్లుగా లేదు. అందుకే దిల్‌రాజు మరో సినిమాను హరీష్‌తో చేయించుకుంటున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక మెగా హీరోతో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు ఒక సినిమాను నిర్మించబోతున్నాడు. ఆ మెగా హీరో ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు. అది వరుణ్‌ తేజ్‌ అయ్యి ఉండవచ్చు లేదా పవన్‌ కాని, చరణ్‌ కాని కూడా అయ్యి ఉండవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి హరీష్‌ శంకర్‌ను దిల్‌రాజు గుత్త పట్టినట్లుగా వరుసగా ఆయనతో సినిమాలు చేయించుకుంటున్నాడు. ఈ సంవత్సరం చివర్లో దిల్‌రాజు బ్యానర్‌లో హరీష్‌ శంకర్‌ కొత్త సినిమా ప్రారంభం కానుంది.

To Top

Send this to a friend