మత దురహంకారం.. దేశంలో మరో కల్లోలం…

సోషల్‌ మీడియా సంఘటిత శక్తి ఏపాటిదో మరోసారి వెల్లడైంది. నిర్భయ ఘటనపై తొలిసారిగా దేశమంతటినీ కదిలించిన ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ ముస్లిం యువకుడు జునైద్‌ దారుణ హత్యపై మరోసారి ఆస్థాయి కదలికను తీసుకువచ్చింది. ‘నాట్‌ఇన్‌మైనేమ్‌’ క్యాంపె యిన్‌ పిలుపుతో వేలాది మంది వీధుల్లోకి వచ్చి మతం పేరిట జరుగుతున్న హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక నిరసన ఢిల్లీలో పెద్ద ఎత్తున సాగుతోంది.. ఈ ఆందోళనలకు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు హాజరై ఆందోళనకారులకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే సీపీఎం సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ లీడర్లు, నటీనటులు షబనా అజ్మీ, కొంకణాసేన్‌, పలువురు ప్రముఖులు ఈ ఉద్యమానికి బాసటగా ఆందోళనల్లో పాల్గొన్నారు..

ఉద్యమానికి అసలు కారణం ఏంటంటే.. ఇటీవలే ఢిల్లీ-మధుర రైలులో ముస్లిం యువకుడి హత్య జరిగింది. కొందరు హిందూ మత చాందస వాదులు ముస్లిం యువకుడిపై దాడి చేసి రైల్లో తోసేయగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ ముస్లిం యువకుడి పేరు జునైద్. అతడి కోసం.. హిందూ మత చాందసవాదులకు వ్యతిరేకంగా ఢిల్లీలో వేల గొంతుకలు ఒక్కటై నినదించాయి.

మతం పేరుతో అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటూ సరిహద్దులు చెరిపేస్తూ దేశమంతా ఏకమైంది. ముస్లిం యువకుడి హత్యకు నిరసనగా ఫిల్మ్‌ మేకర్‌ సబా దివాన్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ఈ కదలికకు కేంద్ర బిందువైంది. జునైద్‌ హత్యకు నిరసనగా ‘నాట్‌ఇన్‌మైనేమ్‌’ క్యాంపెయిన్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో జరిగిన ప్రచారంతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్యాంపెయిన్‌కు మద్దతుగా ముం బయిలో జరిగిన నిరసన ప్రద ర్శనలో బాలీవుడ్‌ నటులు, రచ యితలు, జర్నలిస్టులు, చరిత్ర కారులు పాల్గొన్నారు. ముస్లింలు, దళితుల హత్య లను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈ ఉద్యమం ఇప్పుడు దేశంలో మరో పోరాటానికి నాంది పలుకుతోంది. బీజేపీ ప్రభుత్వ హిందుత్వ వాదాన్ని ఇది ప్రశ్నిస్తోంది..

To Top

Send this to a friend