శోభనం అయ్యాక కన్య కాదని వదిలేశాడు..

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఓ గ్రామం అది. ఘనంగా వివాహం జరిపాక.. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వచ్చేసింది. శోభనం ముహూర్తం పెట్టాక పెళ్లికొడుకు తెలివిగా బెడ్ పై తెల్లటి బెడ్ షీట్ ను వేశాడు. రెండు రోజులు శోభనంలో పెళ్లి కూతురుతో బాగానే అన్నీ చేసేశాడు. ఇక అంతా బాగుందనుకుంటున్న సమయంలో పెళ్లి కొడుకు మూడోరోజు పెళ్లి కూతురు కన్య కాదని.. ఇదివరకే ఆమెకు సెక్స్ అనుభవం ఉందని.. ఈమె నాకు వద్దంటూ పెద్దలను ఆశ్రయించాడు. అతడు చెప్పిన కారణం విని పెళ్లి కూతురు ఆమె బంధువులు షాక్ తిన్నారు.

లక్షలు పోసి పెళ్లి చేశారు.. కట్నకానుకలు సమర్పించారు.. అంగరంగ వైభవంగా పెళ్లి తంతు ముగిసింది. శోభనం ముహూర్తం కూడా పెట్టేశారు. రెండు రోజులు పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఆ తంతును దిగ్విజయంగా పూర్తి చేశారు. మూడోరోజు ఆ పెళ్లి కొడుకు తాము శోభనం చేసుకున్న బెడ్ పై కప్పిన తెల్లటి బెడ్ షీట్ ను పట్టుకొని గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. అమ్మాయి తనకు వద్దు విడాకులు కావాలని కోరాడు. వాళ్లు పెళ్లికొడుకుకే సపోర్ట్ చేసి విడాకులు ఇప్పిస్తామన్నారు.. దీనికి నిర్ఘాంతపోయిన పెళ్లి కూతురు … పెళ్లి కొడుకుపై, గ్రామ పెద్దలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇది సంచలనమైంది..

ఇంతటి అడ్వాన్స్ యుగంలోనూ పెళ్లి కొడుకు తన స్నేహితులు చెప్పిన ఐడియాను ఫాలో అయ్యి అమ్మాయిని కన్య కాదని తేల్చడంతో అంతా నివ్వెరపోయారు. కన్య అయిన అమ్మాయితో తొలిసారి కలిస్తే రక్తపు మరకలు ఆ బెడ్ పై పడతాయట.. అవి పడకపోవడంతో ఈ అమ్మాయి కన్య కాదని పెళ్లి కొడుకు నిర్ధారించాడు. దీంతో విడాకులు కావాలని కోరాడు. ఇంత హైటెక్ యుగంలోనూ ఇంకా కన్యత్వంను పరీక్షించడంపై దానికి సిల్లీ కారణాలను చూపడంపై అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇంత మూఢంగా వ్యవహరించిన పెళ్లి కొడుకును అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారట పోలీసులు..

To Top

Send this to a friend