ఒక్క బొమ్మతో నోకియా ఫోన్ ధర 1.6 లక్షలు

నోకియా కంపెనీ ఓ ఫోన్ ను విడుదల చేసింది. దీనిపై రెండు బొమ్మలు అచ్చు వేసింది. బంగారం పూత పూసింది. కేవలం కొన్ని ఫోన్లను మాత్రమే ఇలాంటివి విడుదల చేసింది. కానీ వీటికి ఎక్కడి లేని క్రేజ్ వచ్చేసింది. జర్మనీలోని జీ-20 సమావేశాల సందర్భంగా నోకియా విడుదల చేసిన ఈ ఫోన్లు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి..

జర్మనీలోని హాంబర్గ్ లో ప్రపంచంలోని 20 అగ్రదేశాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ జీ20 సమావేశాల సందర్భాన్ని పురస్కరించుకొని నోకియా కంపెనీ తన 3310 మోడల్ ను సరికొత్త సొబగులు అద్ది విడుదల చేసింది. దానిపై టైటానియం రేకు అమర్చి ప్రపంచంలోనే అగ్రదేశాలైన అమెరికా, రష్యా అధ్యక్షుల బొమ్మలను అచ్చు వేసింది. దానిపై బంగారం పూత పూసింది. దీని ధరను 2468 డాలర్లుగా ప్రకటించింది. దీన్ని కొనేందుకు ప్రపంచ దేశాల అధ్యక్షులు, ఇతర ఉన్నత పోస్టుల్లోని వ్యక్తులు కూడా ఆసక్తి చూపినట్టు నోకియా వెల్లడించింది..

ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ నోకియా బంగారు పూత ఫోన్ ధర 1.6లక్షలు.. ఈ మోడల్ ను జీ20 సందర్భంగా పరిమిత సంఖ్యలోనే నోకియా విడుదల చేసింది. హాంబర్గ్ లో ప్రదర్శన పెట్టగా ఆయా దేశాధినేతలు దీన్ని కొనుగోలు చేశారట..

To Top

Send this to a friend