నోకియా.. మళ్లీ ఆగయా!

ఈ సామ్ సంగ్, చైనా కంపెనీలు లేనప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక్క ఫోను కంపెనీ నోకియా పేరు ఉండేది.. ఎంతో స్టాండర్డ్ గా.. క్వాలిటీగా ఫోన్లు తయారు చేసిన ఈ ఫిన్లాండ్ కంపెనీ అనంతరం స్మార్ట్ ఫోన్ రావడం.. వివిధ అంతర్జాతీయ , చైనా కంపెనీల రంగప్రవేశంతో తన మనుగడను ప్రశ్నార్థకం చేసుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్ గ్రేడ్ కాకపోవడం తో నోకియా స్మార్ట్ ఫోన్ల పోటీని తట్టుకోలేకపోయింది. దీంతో కంపెనీ నష్టాల పాలైంది. చేసేందేం లేక కంపెనీ చేతులెత్తేయడంతో ఈ నోకియా కంపెనీని మైక్రోసాఫ్ట్ కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.

మైక్రోసాఫ్ట్ ను చేజిక్కించుకున్నాక కూడా నోకియా తలరాత మారలేదు. కొత్తగా ఏ ఫోన్లు నోకియా నుంచి విడుదల కాలేదు. అప్పుడెప్పుడో విడుదల చేసినా అవి మార్కెట్లో విడుదల కాలేదు. కానీ ఇన్నాళ్లకు నోకియా 3310 కొత్త వెర్షన్ ను రేపటినుంచి అందుబాటులో ఉంచింది నోకియా కంపెనీ. దీని ధర 3310గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 3310 ఫోన్ అన్ని ప్రముఖ విక్రయశాలల్లో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ ఫోన్ వివిధ దేశాల్లో 12.6 కోట్లు అమ్ముడుపోయాయట..

కొత్త నోకియా 3310 ఫీచర్లు..
* 1200 ఎంఏహెచ్ బ్యాటరీ-22 గంటలు బ్యాటరీ బ్యాకప్
*డ్యూయల్ సిమ్.. 2.4 అంగుళాల తెర
*2 మెగాపిక్సల్, ఎల్ఈడీ ఫ్లాష్
*బ్లూటూత్, యూఎస్బీ అనుసాంధనత
*16 జీబీ ఇన్ బెల్ట్ మెమరీ

To Top

Send this to a friend