కాజల్‌ లేనిదే రానా లేడట!

ప్రస్తుతం టాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టి ‘డీజే’ చిత్రంపై ఉంది. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘డీజే’ చిత్రం తర్వాత అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రానా నటించిన ‘నేనేరాజు నేనేమంత్రి’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ నటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా తాజాగా విడుదలైన కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌ వీడియో ఉంది.

కాజల్‌ అగర్వాల్‌ పుట్టిన రోజు సందర్బంగా ‘నేనేరాజు నేనేమంత్రి’ యూనిట్‌ సభ్యులు చిన్న టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో రానా డైలాగ్‌ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. నా పేరు రాధా జితేంద్ర.. రాధ లేనిదే జితేంద్ర లేడు అంటూ రానా చెప్పిన డైలాగ్‌ ఆసక్తిని కలిగిస్తుంది. వీరిద్దరు చాలా అన్యోన్యనంగా ఉంటారు. రాజకీయాల కారణంగా వీరిద్దరి మద్యకు కేథరిన్‌ ఎలా ఎంటర్‌ అయ్యిందనేదే సినిమా చెప్పుకుంటున్నారు.

కాజల్‌ కెరీర్‌లో 50వ సినిమా అవ్వడంతో పాటు, రానా ‘భల్లాలదేవుడి’ పాత్ర తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఈ చిత్రంపై ఆకాశానికి తాకేల వస్తున్నాయి. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

To Top

Send this to a friend