రకుల్‌ టైం అయిపోయిందా?


గత సంవత్సరం మొత్తం కూడా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హవా నడిచింది. ప్రతి స్టార్‌ హీరో కూడా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి నటించాలని కోరుకున్నాడు. మోస్ట్‌ వాంటెడ్‌, లక్కీ హీరోయిన్‌గా రకుల్‌ పేరు సంపాదించింది. హీరోయిన్‌ స్టార్‌ ఇమేజ్‌ లైఫ్‌ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. అయితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనీసం రెండు సంవత్సరాలు కూడా కొనసాగకుండానే పనైపోయింది. గత మూడు నాలుగు నెలలుగా ఈమెకు ఆఫర్లే కరువయ్యాయి. ప్రస్తుతం ఈమె మహేష్‌బాబుతో చేస్తున్న ‘స్పైడర్‌’ మినహా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రోజెక్ట్ లు ఏమీ లేవు.

ఇప్పటి వరకు స్టార్‌ హీరోల సరసన నటించిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా గ్లామర్‌కే పరిమితం అయ్యింది. ఏ ఒక్క సినిమాలో కూడా నటిగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. రారండోయ్‌ వేడుక చూద్దాంలో కాస్త పర్వాలేదు అనిపించినా కూడా దాని వల్ల ఉపయోగం లేకుండా పోయింది. కొన్నాళ్ల క్రితం స్టార్‌ హీరోలకు కూడా డేట్లు ఖాళీ లేవు అని చెప్పిన ఈ అమ్మడు ప్రస్తుతం అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం స్టార్‌ హీరోలతో పాటు చిన్న హీరోలు అంతా కూడా పూజా హెగ్డే, రాశిఖన్నా, కీర్తి సురేష్‌, లావణ్య త్రిపాఠిల వెనుక పడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న ‘స్పైడర్‌’ విడుదలై సక్సెస్‌ సాధిస్తే మళ్లీ ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. మొత్తానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టైం దగ్గరపడ్డట్లుగా చెప్పుకుంటున్నారు సినీ జనాలు.

To Top

Send this to a friend