ఫోన్లలో చార్జింగ్ బాధ ఉండదు ఇక..

టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ పని అయినా అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ తో అయిపోతోంది. లావాదేవీలు, ఇతర పనులు, విధులు అన్ని ఫోన్లతోనే అయిపోతున్నాయి. సమాచార స్రవంతిలో వాట్సాప్ , ఫేస్ బుక్ కీలకంగా మారాయి. అవి లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. అయితే ఫోన్లో చార్జింగ్ ఉంటేనే ఇవన్నీ చేయగలం. కానీ ఇప్పుడొస్తున్న ఫోన్లంటిలో చార్జింగ్ ప్రధాన సమస్యగా మారింది. ఫోన్ వాడకం ఎక్కువై పోవడంతో పొద్దున చార్జింగ్ పెడితే సాయంత్రానికి ఫోన్ చార్జింగ్ అయిపోతోంది. అందుకోసం మళ్లీ పవర్ బ్యాంకో, చార్జర్ జేబులో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. వీటన్నింటికో పరిష్కారం చూపించారు అమెరికా శాస్త్రవేత్తలు.. ఆ దిశగా వారు జరుపుతున్న పరిశోధనలు సఫలీకృతమవుతున్నాయి.

ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ ఫోన్ బ్యాటరీ, చార్జింగ్ లేకుండానే పనిచేస్తోంది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ చార్జింగ్ తో పాటు బ్యాటరీయే అవసరం లేని సెల్ ఫోన్ ను తయారు చేసింది. ఇందులో వినూత్న విద్యుత్ వినియోగం దాదాపు శూన్యం.

ఈ ఫోన్ అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బ్యాటరీ ఆధారంగానే మన ఫోన్లు పనిచేస్తున్నాయి. కానీ ఈ ఫోన్ తను పనిచేయడానికి కావలసిన శక్తిని తనకు తానుగా తయారు చేసుకుంటోంది. ఫోన్ కు కావలసిన శక్తిని మనం ఫోన్ మాట్లాడేటప్పుడు అటూ ఇటూ పోయే రేడియో తరంగాల ద్వారా గ్రహించేలా తీర్చిదిద్దారు. కాంతి తరంగాల నుంచి కూడా ఈ సెల్ ఫోన్ శక్తిని గ్రహిస్తుందట.. సో బ్యాటరీ బాధ తీరి తరంగాల ద్వారా శక్తిని వాడుకొని ఫోన్ పనిచేస్తుందన్నమాట.. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన శ్యాం గుల్లకోట కూడా పాలుపంచుకుంటున్నారు.

To Top

Send this to a friend