వారికి టాలీవుడ్‌ బహిష్కరణ


తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులుగా ఇంత కాలం స్టార్‌ ఇమేజ్‌ను అనుభవిస్తున్న రవితేజ, పూరి, ఛార్మి, ముమైత్‌, చోటాకే నాయుడు ఇంకా పలువురు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదివరకే టాలీవుడ్‌ పెద్దలు డ్రగ్స్‌ తీసుకుంటున్న వారి వల్ల టాలీవుడ్‌ పరువు పోతుంది. మానేయాలంటూ హెచ్చరించారు. అయినా కూడా వారిలో మార్పు రాలేదు. డ్రగ్స్‌ తీసుకుంటున్న వారు అంటూ నోటీసులు అందుకున్న వారు ఈనెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఆ విచారణలో వారు డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా వెళ్లడైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాలీవుడ్‌ పెద్దలు నిర్ణయించుకున్నారు. వారిని టాలీవుడ్‌ నుండి బహిష్కరించడం లేదా మరే కఠిన చర్యలు  అయితే తీసుకోవాలని భావిస్తున్నారు. ఇటీవలే మా ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్‌, సురేష్‌బాబు, మా అధ్యక్షుడు వంటి వారు డ్రగ్స్‌కు ఇప్పటికైనా దూరంగా ఉండాలని ఆ పది మందికి సూచించడం జరిగింది.

నోటీసులు అందుకున్న వారు అందరు కూడా తాము నిర్దోషులం అని, తమకు ఎలాంటి పాపం తెలియదు అంటున్నారు. విచారణలో ఎవరు ఏంటి అనేది తేలే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. నందు మరియు నవదీప్‌లు  మీడియా ముందుకు వచ్చి తమకు ఏ పరిక్ష చేసిన ఓకే అంటున్నారు. ఇక చోటాకే నాయుడు మరియు ఇతరులు కూడా తమకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. వీరిపై ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది ఈనెల 19న విచారణ పూర్తి అయిన తర్వాత తేలే అవకాశం ఉంది.

To Top

Send this to a friend