జూలై 7న ‘నిన్ను కోరి’

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను, నేను లోకల్‌ వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని ‘నిన్నుకోరి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న ‘నిన్నుకోరి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్‌ సాంగ్‌ ‘అడిగా అడిగా.. ఎదలో లయలడిగా’కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది.
ఈ చిత్రం గురించి నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ – ”ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో సినిమా అంతా ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. ఈ చిత్రంలో ఆదితో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. ‘నిన్నుకోరి’ నాకు మరో మంచి సినిమా అవుతుంది” అన్నారు.
నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ – ”నానితో ఫస్ట్‌ టైమ్‌ చేస్తున్న సినిమా ఇది. కథకు అనుగుణంగా సినిమాలోని ఎక్కువ శాతం షూటింగ్‌ అమెరికాలోనే చెయ్యడం జరిగింది. అలాగే హైదరాబాద్‌, వైజాగ్‌లో కూడా షెడ్యూల్స్‌ చేశాం. టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల రిలీజ్‌ చేసిన ‘అడిగా అడిగా ఎదలో లయలడిగా..’ సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. గోపీసుందర్‌ అన్నీ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. వరసగా సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తున్న నానికి ‘నిన్నుకోరి’ మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ మూవీ ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7 వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.
ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న యంగ్‌ హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ – ”మలుపు, సరైనోడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా ఇది. నానితో కలిసి వర్క్‌ చెయ్యడం చాలా హ్యాపీగా అనిపించింది. శివ చెప్పిన సబ్జెక్ట్‌ నాకు బాగా నచ్చింది. ఇందులో నా క్యారెక్టర్‌ని డిజైన్‌ చేసిన విధానం కూడా బాగుంది. ఈ సినిమా నా కెరీర్‌కి మంచి ప్లస్‌ అవుతుంది” అన్నారు.
కోన వెంకట్‌ మాట్లాడుతూ – ”ఒక కొత్త పాయింట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సబ్జెక్ట్‌ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో వున్నాయి. నానికి ‘నిన్నుకోరి’ మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.
హీరోయిన్‌ నివేథా థామస్‌ మాట్లాడుతూ – ”జెంటిల్‌మన్‌ తర్వాత నానితో మళ్ళీ వర్క్‌ చెయ్యడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అనే ఎక్సైట్‌మెంట్‌తో వున్నాను” అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – ”ఒక సెన్సిబుల్‌ పాయింట్‌ని తీసుకొని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. కోన వెంకట్‌గారి స్క్రీన్‌ప్లే ఈ కథకు మంచి గ్రిప్‌ ఇచ్చింది. నేను అనుకున్నట్టుగానే సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సహకారంతో షూటింగ్‌ పూర్తి చెయ్యగలిగాం. దానయ్యగారులాంటి పెద్ద ప్రొడ్యూసర్‌ బేనర్‌లో ఇంత మంచి టీమ్‌తో వర్క్‌ చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగించింది” అన్నారు.
నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.

To Top

Send this to a friend