నిన్నుకోరి కష్టాల్లో పడ్డాడు!

యువ హీరో నాని చిత్ర బడ్జెట్‌ నిన్న మొన్నటి వరకు 10 కోట్లు అంతకు లోపే. అయితే తాజాగా తెరకెక్కిన ‘నిన్నుకోరి’ చిత్రంకు నిర్మాత ఏకంగా 15 కోట్లకు మించి పెట్టినట్లుగా తెలుస్తోంది. నాని ‘నేను లోకల్‌’ చిత్రంతో 30 కోట్లను సాధించాడు. అయితే ఆ సినిమా భారీ విజయం సాధించడంతో అది సాధ్యం అయ్యింది. ఆ సినిమా వసూళ్లను దృష్టిలో ఉంచుకుని నిన్నుకోరి సినిమాకు కాస్త ఎక్కువ బడ్జెట్‌ పెట్టారు. ఇప్పుడు అది సమస్యగా మారింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 15 కోట్లకు అమ్ముడు పోవడం లేదని, విడుదలైన తర్వాత ఈ చిత్రం ఫలితం తారు మారు అయితే నిర్మాతకు భారీ నష్టం తప్పదని అంతా అంటున్నారు. నానితో 10 కోట్లు పెట్టి సినిమాను తీస్తే తప్పకుండా అది మినిమం గ్యారెంటీ చిత్రంగా అవుతుందని, కాని 15 కోట్లు పెట్టడం వల్ల నిర్మాత 5 కోట్లు రిస్క్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది.

‘నిన్నుకోరి’ చిత్రం సక్సెస్‌ అయితే 15 కోట్లు నానికి పెద్ద కష్టం ఏమీ కాదు. కాని ఫలితం తారు మారు అయితేనే ఇబ్బంది. నాని హీరోగా నివేద థామస్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్య పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. సినిమా టీజర్‌ మరియు ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇదో మాస్‌ సినిమా కాదని, పక్కా క్లాస్‌ చిత్రంగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. నేను లోకల్‌ మాస్‌ చిత్రం కనుక 30 కోట్లను రాబట్టింది. కాని ఇది ఎంత రాబడుతుందనే నమ్మకంగా చెప్పలేక పోతున్నారు.

To Top

Send this to a friend