ప‌దిరోజుల‌కి 18 కొట్లు వ‌సూలు చేసిన ‘కేశవ’

ప‌దిరోజుల‌కి 18 కొట్లు వ‌సూలు చేసిన నిఖిల్‌,సుధీర్ వర్మ, అభిషేక్‌ పిక్చర్స్ ‘కేశవ’
నిఖిల్‌ నటించిన కేశ‌వ చిత్రం మే 19న విడుద‌ల‌య్యి మంచి టాక్ తో సూప‌ర్బ్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది.  దర్శకుడు సుధీర్‌వర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రొక్క‌సారి డిఫిరెంట్ పాయింట్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం విడుద‌ల‌య్యి అంద‌రి ప్ర‌శంశ‌లు పొంద‌టమే కాకుండా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఒపెనింగ్ గా నిల‌వటం విశేషం.  మెద‌టి మూడురోజులు 11 కొట్ల 40 ల‌క్ష‌లు వ‌సూలు చేసి, మెద‌టి వారం 16 కొట్లు గ్రాస్ తో, రెండ‌వ వారం కూడా స్ట‌డి క‌లెక్ష‌న్ల తో నిఖిల్ కి స‌మ్మ‌ర్ బెస్ట్ హిట్ గా నిలుస్తుంది.  రెండ‌వ వీకెండ్ కి దాదాపు అన్ని ఎరియాల్లో బ్రేక్ ఈవెన్ గా నిల‌వ‌టమే కాకుండా దాదాపు 18 కోట్లు వ‌సూలు చేసింది.
తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా నిర్మాత. ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మెద‌టి నుండి ప‌గ‌, ప్ర‌తీకారం అనే క‌థాంశంతో న‌డుస్తుండ‌టంతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో ధియోట‌ర్స్ లో సీట్స్ లో ప్రేక్ష‌కుడ్ని క‌ట్టిపాడేసింది. చూస్తున్నంత వ‌ర‌కూ క్లైమాక్స్ ఎంట‌నే ఆశ‌క్తితో ప్రేక్ష‌కులు చిత్రాన్ని చూస్తున్నారు. మంచి చిత్రాల‌కి, కొత్త చిత్రాల‌కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డ‌తార‌నేది మ‌రోక్క‌సారి ఈ కలెక్ష‌న్ల తో ప్రూవ్ అవ్వ‌టం చాలా హ్య‌పి అంటున్నారు. నిర్మాత అభిషెక్ నామ‌
రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్‌: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్‌ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్‌.,
సమర్పణ: దేవాన్ష్‌ నామా.
సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల,
నిర్మాత: అభిషేక్‌ నామా,
 కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ,
To Top

Send this to a friend