నిద్రపోయే జాబ్.. 11 లక్షల జీతం..


లండన్ లోని ఫ్రాన్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీ శాస్త్రవేత్తలు పడుకుంటే 11 లక్షల జీతం ఇస్తామని ప్రకటించింది. మూడు నెలల ఈ ఉద్యోగం లో ఏ పనిచేయనక్కర్లేదని కేవలం పడుకుంటే చాలని ప్రకటణ జారీ చేసింది..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భార రహిత స్థితిలో పునరుత్పత్తి పై శాస్త్రవేత్తలు పరిశోదనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు నెలల పాటు నిద్రించే వారికోసం వెతుకుతున్నారు. జాబ్ కోసం వచ్చేవారు మూడు నెలలు నిద్రపోవాలి. మొదట రెండు వారాలు పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత 60రోజులు నిద్ర. తిరిగి మామూలు స్థితికి వచ్చేందుకు రెండు వారాలు పునరావాస కేంద్రంలో ఉండాలి.

ఈ 60రోజులు కేవలం తినడం.. పడుకోవడం..వాషింగ్ తదితర నిత్యకృత్యాలు మాత్రమే తీర్చుకొని పడుకోవాలి.. జాబ్ మగవారికే మాత్రమేనట.. పొగతాగే అలవాటు ఉండకూడదు.. 45 ఏళ్లలోపు వారై ఉండాలి.. లండన్ లో నిర్వహించే ఈ పరిశోధనకు దరఖాస్తు ఆన్ లైన్ లో చేసుకోండి..

To Top

Send this to a friend