రాజమౌళి కొత్త సినిమాపై మరో ప్రచారం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దాదాపు అయిదు సంవత్సరాల పాటు ‘బాహుబలి’ చిత్రం కోసం పని చేశాడు. రెండు పార్ట్‌లుగా ఆ చిత్రాన్ని రూపొందించి ఇండియాలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి తర్వాత సినిమా ఏంటి అనేది ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న. బాహుబలి 2 విడుదలై దాదాపు రెండు నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు జక్కన్న తర్వాత సినిమా అప్‌ డేట్‌ లేదు.

‘బాహుబలి’ తర్వాత ఆరు నెలల పాటు రాజమౌళి విశ్రాంతి తీసుకుంటాడని ప్రచారం జరిగింది. అయితే రాజమౌళి మాత్రం విశ్రాంతి తీసుకుంటూనే తన తర్వాత సినిమా గురించిన ఆలోచనలు చేస్తున్నట్లుగా తేలింది. ఇప్పటికే పలు కథలను జక్కన్న సిద్దం చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరో ఆసక్తికర వార్త జక్కన్న సినిమా గురించి వస్తుంది.

రాజమౌళి ఈసారి ఒక మల్టీస్టారర్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడని తెలుగులో ఒక స్టార్‌ హీరో తమిళంలో ఒక స్టార్‌ హీరోతో ఆ సినిమా ఉంబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీలలో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. వంద కోట్ల బడ్జెట్‌తో జక్కన్న తర్వాత సినిమా ఉండబోతుంది. రాజమౌళి ఇప్పటికే తన తర్వాత సినిమాలో భారీ గ్రాఫిక్స్‌ను ఉపయోగించడం లేదు అని తేల్చి చెప్పాడు. అంటే మొదలు పెడితే ఆరు ఏడు నెలల్లో సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తాడని భావించవచ్చు. అయితే మల్టీస్టారర్‌లో నటించబోతున్న ఆ హీరోలు ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

To Top

Send this to a friend