కొత్త తరహా సినిమా హాల్స్‌ వచ్చేశాయ్‌


టెక్నాలజీ మారుతుంటే జీవన విధానంలో మార్పులు వస్తున్నాయి. అన్ని రంగాల్లో కూడా మార్పు వస్తుంది. ఇప్పటి వరకు సినిమాలు అంటే కూర్చుని చూసే సినిమా హాల్స్‌ మనకు తెలుసు. విదేశాల్లో అయితే కార్లలో కూర్చుని సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇండియాలో మాత్రం ఇప్పటికి అప్పటి తరహా థియేటర్లే కొనసాగుతూ వస్తున్నాయి. దేశంలోనే మొదటిసారి పడుకుని సినిమా చూసే థియేటర్‌ను రిలయన్స్‌ సంస్థ ప్రారంభించబోతుంది.

గుజరాత్‌లోని వడోదరలో దేశంలోని అతి పెద్ద థియేటర్‌ను ప్రారంభించబోతున్నారు. ఈనెల 26న రిలయన్స్‌ అతి పెద్ద మాల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో మొదటి సారి ఈ తరహా థియేటర్‌ ప్రారంభం కానుంది. 800 రూపాయల టికెట్‌ ధర కలిగిన ఈ థియేటర్‌లో హాయిగా పడుకుని చూడవచ్చు. దేశంలో అన్ని ప్రముఖ పట్టణాల్లో కూడా ఈ తరహ మాల్స్‌ థియేటర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

దాదాపు 500 మంది పట్టే వీలుండే ఈ థియేటర్స్‌ దేశంలోని సరి కొత్త సినిమా విప్లవంను తీసుకు వస్తుందని ఆశిస్తున్నారు. గుజరాత్‌లోని వడోదరలో మొదలు పెట్టబోతున్న ఈ థియేటర్‌కు వచ్చే స్పందనను పరిగణలోకి తీసుకుని దేశంలో ఇతర ప్రాంతాల్లో ప్రారంభం చేసే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend