నోట్ల కష్టాలు.. మరో కొత్త నోటు


పెద్ద నోట్లు రద్దు చేసి మోడీ ఎంత పేరు తెచ్చుకున్నాడో.. అంతే స్థాయిలో విమర్శలు కొనితెచ్చుకున్నాడు. ఆ నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో తీవ్రమైన డబ్బుల కొరత వేధిస్తోంది. జనం చేతిలో డబ్బులు ఉండడం లేదు. మార్కెట్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చడానికి కొత్తగా మరో నోటును తీసుకొస్తోంది..

నగదు లావాదేవీల్లో ఇప్పుడు రూ.500, రూ.100 నోట్లే కనిపిస్తున్నాయి. రూ.100 నోట్లు ఏటీఎంలలో రావడం లేదు. దీంతో పేదలు, కూలీలకు నగదు పంపిణీ కష్టమవుతోంది. అందుకే ఈ కష్టాలు తీర్చడానికి మోడీ ప్రభుత్వం ఆర్బీఐ కొత్తగా రూ.200 నోటును తీసుకొచ్చింది.. ఈ మేరకు ట్రయల్స్ నడుస్తున్నాయి.

మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ప్రభుత్వ ముద్రణాశాలకు కొన్ని వారాల క్రితమే ఈ నోట్ల ముద్రణ పనిని అప్పగించారు. ఈ రూ.200 నోటులో ఎన్నో అత్యాధునిక రక్షణ చర్యలు చేపట్టారు. వివిధ కోణాల్లో తనిఖీ చేసి నకిలీవి సృష్టించడానికి వీలులేని రీతిలో తయారు చేస్తున్నారట.. సో త్వరలోనే కొత్త రూ.200 నోటు మార్కెట్లోకి రాబోతున్నదన్నమాట..

To Top

Send this to a friend