తక్కువ ధరలో అగ్ర కంపెనీ ఫోన్ విడుదల

భారత్ ఇప్పుడు అవకాశాల గని.. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అన్ని ప్రధాన మొబైల్ కంపెనీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే తక్కువ ధరలో మంచి ఫీచర్లతో బడ్జెట్ ఫోన్లను విడుదల చేసే పనిలో పడ్డాయి.

మొన్నటికి మొన్న షియోమి రెడ్ మీ 4ఏ 6000 రూపాయలకే మార్కెట్లోకి విడుదలై హాట్ కేకులా అమ్ముడుపోతున్న సంగతి తెలిసింది. ఇంటెక్స్ ఆక్వా ఫోన్లు కూడా 5-6వేల మధ్యనే అమ్ముతూ మార్కెట్లో విరివిగా అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడు ఆ కోవలోనే అమెరికన్ అగ్రశ్రేణి ఫోన్ల తయారీ కంపెనీ మోటో భారత మార్కెట్లోకి తక్కువ ధరలో ఓ ఫోన్ ను విడుదల చేసింది..

మోటో సీ పేరుతో విడుదలైన ఫోన్ ధరను కంపెనీ రూ.5999గా నిర్ణయించింది. దాదాపు 100 నగరాలతో పాటు ఆన్ లైన్ ఈ ఫోన్ ను విడుదల చేసినట్టు కంపెనీ తెలిపింది..

మోటో ఫీచర్లు ఇవే..
-5 అంగుళాల డిస్ ప్లే
-1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ
-5 ఎంపీ వెనక, 2 ఎంపీ ముందు కెమెరా
-2350ఎంఏహెచ్ కెమెరా
-ధర : రూ.5999

To Top

Send this to a friend