స్మార్ట్ ఫోన్లలోకి మరో కొత్త వైరస్.

జూడీ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు ఇప్పటికే 3.65 కోట్ల స్మార్ట్ ఫోన్లలోకి చేరిపోయిందట.. మొదటగా ఫ్యాషన్, కుకింగ్ గేమ్ గా గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించే ఈ జూడీ వైరస్ యాప్.. అనేక యాప్ లతో కుమ్మక్కవుతుంది. డౌన్ లోడ్ చేసుకుంటే వాటితోపాటు మన ఫోన్ లోకి వచ్చి తిష్టవేస్తుందట.. ఇప్పటికే 3.65 కోట్ల ఫోన్లలోకి ఈ జూడీ వైరస్ వచ్చినట్టు గూగుల్ ఒక ప్రకటించడం స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కలవరపెడుతోంది.

 

వివిధ యాప్ లతో పాటు ఇదీ ఫోన్లలో చేరిపోయి సైబర్ నేరగాళ్లకు విలువైన సమాచారంతో పాటు ఆదాయాన్ని సంపాదించిపెట్టిందట.. ఆలస్యంగా మేల్కొన్న గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి ఈ వైరస్ యాప్ ను తీసేసి పనిలో పడిందని సమాచారం.

ఇంతకాలంగా దొంగచాటుగా ప్లే స్టోర్ లో ఉన్న ఈ యాప్ లను గూగుల్ ఇటీవలే గుర్తించింది. ఈ మాల్ వేర్ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి యూజర్ కి తెలియకుండానే గూగుల్ యాడ్ లను క్లిక్ చేయడం మొదలుపెడుతుంది. తద్వారా ప్రకటనల ఆదాయం సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళుతుందట.. గూగుల్ గుర్తించి కొన్ని యాప్ లను తొలగించే పనిలో పడిందట.. ఫోన్లలో ఉన్నవారందరూ వెంటనే అనుమానాస్పద యాప్ లను అన్ ఇన్ స్టాల్ చేయాలని గూగుల్ ప్రకటించింది.

To Top

Send this to a friend