బిగ్ బాస్ లో అనుకోని సంఘటన..

ఎన్నో సంచలనాలకు కారణమైన బిగ్ బాస్ షోలో నిన్నరాత్రి మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ శనివారం నుంచి బిగ్ బాస్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడట.. షో మొదలైనప్పుడు మొదటి కెప్టెన్ గా సంపూర్ణేష్ బాబు విఫలం కావడంతో రెండో వారంలో కల్పనను బిగ్ బాస్ కెప్టెన్ గా నియమించారు. ఇక మూడో వారంలోకి రావడంతో నిన్న బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ముగ్గురి మధ్య పోటీ పెట్టాడు. కల్పనతో పాటు ప్రిన్స్, శివబాలాజీలు కెప్టెన్ పదవి కోసం పోటీపడ్డారు. ఈ ముగ్గురికి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్..

బొమ్మ గుర్రాలపై ఎవరైతే ఎక్కువ సేపు ఊగుతారో వారే కెప్టెన్ అని నిర్ణయించారు. ఈ పోటీలో మొదట శివబాలాజీ అలసిపోయి ఓ గంట పాటు గుర్రంపై ఊగి ఇక నా వల్ల కాదంటూ పోటీ నుంచి తప్పుకొన్నాడు. మిగతా ఇద్దరు కల్పన, ప్రిన్స్ లు పోటీపోటీగా ఊగారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన పోటీ రాత్రి 8 గంటల వరకు సాగింది. తన కెప్టెన్సీని నిలబెట్టుకోవడం కోసం కల్పన పోరాడగా.. తీవ్ర ఇబ్బందులు పడింది.

కెప్టె న్ పదవి కోసం సింగర్ కల్పన చేసిన ఈ పని శృతిమించింది. చివరకు కల్పన పట్టుసడలించింది. తాను ఇక ఊగలేనని అలసిపోయి కుప్పకూలిపోయింది.. ఆమెకు ఏమైందోనని అందరూ పట్టి లేపగా కొద్దిసేపటికి తేరుకుంది. కానీ మరోవైపు కొత్తగా కెప్టెన్ గా రావడానికి ప్రిన్స్ బొమ్మ గుర్రంపై ఊగుతునే ఉన్నాడు. చివరకు కల్పన ఓటమిని అంగీకరించడంతో కెప్టెన్ గా ప్రిన్స్ ఎన్నికయ్యాడు.

To Top

Send this to a friend