వీడు మామూలోడు కాదు.. పుట్టుకతోనే నడిచేస్తున్నాడు

‘కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు’ అని తెలుగులో ఒక సామెత ఉంది. ఆ సామెత ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదని, పుట్టుకతో నడిచి వచ్చే కొడుకు పుట్టడం అసాధ్యం అని ఇంత కాలం అనుకున్నారు. ఏదో మంచి జరగబోతుంది అనేందుకు ప్రత్యామ్నాయంగా ఆ సామెత వాడారు. కాని తాజాగా ఆ సామెత నిజం అయ్యింది. పుట్టుకతోనే ఆ కుర్రాడు నడవడం మొదలు పెట్టాడు. మామూలుగా అయితే మూడు నెలల వరకు పిల్లలను పట్టుకునేందుకు కొందరు భయపడతారు. వారు ఆ సమయంలో చాలా సున్నితంగా ఉంటారు.

దేశ రాజధాని దిల్లీ శివారు ప్రాంతంలో ఒక హాస్పిటల్‌లో అద్బుతం జరిగింది. ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఒక మహిళ డెలవరీకి వెళ్లింది. అక్కడ ఆమెకు ఆపరేషన్‌ చేసి శిషువును తీయడం జరిగింది. ఆ సమయంలోనే ఆ శిషువు ఆరోగ్య పరిస్థితిని చెక్‌ చేసేందుకు వైధ్యులు నిలిపే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ కుర్రాడు అడుగులు వేయడం మొదలు పెట్టాడు. దాంతో వెంటనే పక్కనే ఉన్న మరో వైధ్యుడు ఆ విషయాన్ని తన సెల్‌ కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది. ఇలా జరగడం చాలా అరుదు అని, అయితే ఆ బాలుడు మంచి ఆరోగ్యంగా ఉండటంతో పాటు, అతడి తల్లి పోషకారం తీసుకోవడం వల్ల కుర్రాడు ప్రతిభావంతుడిగా జన్మించినట్లుగా వైధ్యులు చెబుతున్నారు.

To Top

Send this to a friend