కొత్తగా 50నోటు.. అందులో ఎన్నో భద్రతలు..

మార్కెట్లోకి కొత్తగా రూ.50 నోటు రాబోతోంది. ఇప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.50నోట్ల కంటే ఇవి విభిన్నంగా ఉన్నాయి. వీటితోపాటు కొత్తగా రూ.20నోట్లను కూడా రిజర్వ్ బ్యాంక్ మార్కెట్లోకి తేనున్నట్లు సమాచారం. ఇందులో చిప్ తరహా ఎలక్ర్టానిక్ పరికరాలున్నాయని… ఇవి ఎక్కడున్నా శాటిలైట్ సాయంతో కనుక్కునే అవకాశాలున్నాయని సమాచారం. అంతేకాదు.. వీటినెవ్వరూ కాపీ కొట్టకుండా తయారు చేసినట్లు ఆర్బీఐలోని వర్గాలు చెబుతున్నాయి.

రూ.50నోట్ల తయారీలో ఎన్నో భద్రతా అంశాలు పొందుపరిచారట.. నోటు ముందు భాగంలో గాంధీజి బొమ్మ ఉండగా.. పాలపిట్ట రంగులోని నోటు వెనుక భాగంలో హంపి రాతిరథం దర్శనమిస్తోంది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్ లో భాగంగా నూతనంగా డిజైన్ చేసిన, భద్రతాపరంగా ఉన్నత ప్రమాణాలు ఉన్న నోట్లను దేశంలో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఇక కొత్తగా రూ.1000 నోట్లను ప్రవేశపెట్టే ఆలోచనేది లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. గతేడాది నవంబర్ 8న నరేంద్రమోడీ రాత్రికి రాత్రే పెద్ద నోట్లు అయిన రూ.500, రూ.1000 నోట్లను దేశంలో రద్దు చేసి దుమారం రేపారు. ఈ ఎఫెక్ట్ వల్ల చాలామంది నల్లకుభేరుల సొమ్ము పనికిరాకుండా పోయింది. ఆ తర్వాత వాటి స్థానంలో కొత్తగా రూ.2000 , రూ.500 నోటును ప్రవేశపెట్టాు. తాజాగా ఏడాది కావస్తున్న సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ కొత్త సిరీస్ తో రూ.50నోట్లను ప్రవేశపెట్టింది.

To Top

Send this to a friend