షాక్ అయ్యా.. ఇలా అవుతుందనుకోలేదు..

 

సంగక్కర, మహేళ జయవర్దనె లాంటి దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు పని అయిపోయిందని అందరూ భావించారు. ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీలో ఆడే శ్రీలంక జట్టులో ఏ ఒక్క తెలిసిన మొహం లేదు. కెప్టెన్ మాథ్యూస్ కు ఆల్ రౌండర్ గా కొంచెం పేరున్నా అతడు ఫిట్ నెస్ సమస్యలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఇండియా … శ్రీలంకపై ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ భావించారు. అంతకుముందే పాకిస్తాన్ పై గెలిచి సమరోత్సాహంతో ఉన్న భారత్ శ్రీలంకను ఊదేస్తుందని భావించారంతా.. కానీ కథ అడ్డం తిరిగింది..

అనామకులు అద్భుతంగా ఆడారు. భారత్ బౌలింగ్ ను చీల్చిచెండాడి శ్రీలంకను గెలిపించారు. 322 పరుగులు చేసినా భారత్ గెలవలేకపోయింది. ధావన్ శతకం వృథా అయ్యింది. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన భారత్ బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయింది.

శ్రీలంక చేతిలో ఓడిపోయిన అనంతరం విలేకరులతో మాట్లాడిన కోహ్లీ.. ‘ఈ ఓటమికి బౌలర్లే బాధ్యులని స్పష్టం చేశారు. 322 పరుగులంటే సాధారణ లక్ష్యమేం కాదు.. బౌలర్లు గెలిపిస్తారనుకున్నా.. కానీ శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వారి టైమింగ్, షాట్ సెలక్షన్ బాగుంది. మా బౌలర్లు ఫెయిల్ అయ్యారు..’ అని కోహ్లీ ఓటమికి కారణాలను వివరించాడు.

గ్రూప్ బీలో ఇప్పుడు సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలా ఒక విజయం సాధించాయి. ప్రస్తుతం శ్రీలంక/పాకిస్తాన్, భారత్/సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతలే సెమీస్ చేరుతాయి. దీంతో ఈ ఆఖరి ఫైట్ ఆసక్తికరంగా మారింది.

To Top

Send this to a friend