నీ ఊహలకు రెక్కలొస్తే..


ఫేస్ బుక్ ద్వారా మనం చెప్పే విషయంలో అందరికీ చేరిపోతుంది. అందులో దాచడానికి ఉండదు.. ఎవరు రాశారో తెలుస్తుంది. అందుకే తమ చిలిపి కోరికలు, డిమాండ్లు.. సరదా సన్నివేశాలన్నింటిని ముఖాముఖిగా పంపే వాట్సాప్ లలో మాత్రమే కొందరు సర్క్కూలేట్ చేస్తున్నారు. ఎందుకంటే అది మనం పంపించేవారికి మాత్రమే తెలుస్తుంది. అందుకే సృజనశీలురు ఎక్కువగా ఇప్పుడు వాట్సాప్ లలోనే తమ భావాలు, కోపాలు, తాపాలు పంచుకుంటున్నారు. అలా వైరల్ గా మారే చాలా న్యూస్ వచ్చేస్తుంటాయి.. అలానే సోషల్ నెట్ వర్క్ కార్మికుల డిమాండ్లంటూ సంఘం ఏర్పాటు చేసి తమ కోర్కెల చిట్టాను విప్పుతున్నారు. మీరూ చూసి ఆ డిమాండ్ల సాధన కోసం గట్టిగా ట్రై చేయండి..

ప్రభుత్వానికి సోషల్ నెట్ వర్క్ కార్మికుల డిమాండ్స్:

1) ప్రతిరోజూ 9 గంటల ఉచిత నెట్ వర్క్ ఏర్పాటు చేయాలి.

2) 24 గంటలు ఆన్ లైన్ లో మగ్గుతున్న పేదలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు అందచేయాలి, డాటా చార్జీలను ప్రభుత్వమే భరించాలి.

3) ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు 8 పని గంటల్లో 3 గంటలు సోషల్ నెట్ వర్క్ కు కేటాయించి, ఉచిత వై ఫై సౌకర్యం కల్పించాలి.

4) డ్రైవింగ్ లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు పోయినవారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కల్పించాలి.

5) చురుగ్గా, ఉత్సాహంగా పాల్గొంటున్న కార్మికులకు “చాటింగ్ చక్ర” “లైక్ వీరుడు” “పోస్టింగ్ రత్న” వంటి అవార్డులతో గౌరవిచాలి.

6) సభ్యులై వుండి అస్సలు చురుకుగా పాల్గొనని , కనీసం పోస్టింగ్ లకు స్పందించని వారికి వారంరోజులుపాటు అయిపోయిన తెలుగు సీరియల్స్ చూపించేలా శిక్ష విధించాలి.

* చివరగా.. నెటిజన్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

To Top

Send this to a friend