ప్రకృతి “టోకు” న్యాయం

ప్రకృతి తనకు తాను రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ఈ సారికి “కరోనా ” ని ఎంచుకుంది.గతంలో ఎన్నడూలేని విధంగా మానవులు,మానవునితో పాటు సహజ వనరులను పంచుకొని జీవించే హక్కు కలిగిన అనేక జీవుల హక్కులు కాపాడడానికి కరోనా వైరస్ రూపంలో కనబడని శక్తి సృష్టించబడినది.

కరోనా వల్ల జరిగిన ప్రకృతి సమతుల్యత పరిశీలిస్తే ఉదాహరణకు”ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో చాలా మెరుగుపడింది.అంటే కాలుష్యం తగ్గింది.నిజానికి ప్రపంచంలో ఉన్న 34 అత్యంత పెద్ద నగరాలలో మొదటి స్థానంలో నిలిచింది.చైనా లోని పారిశ్రామిక కేంద్రం వూహాన్ నగరంలో కూడా కాలుష్యం చాలా తగ్గింది అని ఉపగ్రహ చిత్రాల వల్ల తెలుస్తోంది.కెనడా శాస్త్ర వేత్తల పరిశోధనల్లో భూమి చుట్టూ ఉన్న ఓజోన్ పొర కు పడిన రంద్రం చాలా వరకు పూడింది అని తేలింది.”

“టోకు న్యాయం” అంటే ఇలాగే వుంటుంది. క్రమ శిక్షణ పాటించని విద్యావంతులైన మూర్కుల తో పాటు,అమాయకులు కూడా బలిఅవుతారు. యుద్ధం లో మంచి ,చెడు ఉండదు.అడ్డు వచ్చిన వారు బలి అవుతారు.

ఐనా మానవ చరిత్రలో కరోనా అనేది చాలా తక్కువ ప్రాణ నష్టం చేసే న్యాయం అనుకోవచ్చు. ప్లేగు వ్యాధి,మీజిల్స్,,కలరా ,మలేరియా,డయేరియా వంటి అంటువ్యాధుల వల్ల కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.కరోనా వైరస్ బాధితుల్లో మరణాల శాతం తక్కువగా ఉంది.

కరోనా వ్యాధి ని తప్పించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనేకమంది ప్రజలు క్రమశిక్షణ పాటించకుండా బలి అవుతున్నారు.తమ సొంత వారిని బలి చేస్తున్నారు. స్వేచ్ఛ ఎక్కువై , ప్రాణాలకు తెగించి ఉద్యోగం చేస్తున్న పోలీసులకు ఎదురు తిరుగు తున్నారు.

ప్రకృతి న్యాయానికి కుల,మత వర్గ భేదం లేదు. మక్కా వెళ్లొచ్చిన ముస్లిం ఐనా, వాటికన్ వెళ్లిన క్రిస్టియన్ ఐనా, వారణాసి వెళ్లిన హిందువైనా ఒక్కటే న్యాయం.మత పండితులు ఇచ్చిన మంత్రించిన జలం,ఆయిల్ లు పని చేయవు.గుంపులుగా ప్రార్ధనా లయాలకు వెళ్లి ప్రార్ధనలు చేసినా ఫలితం ఉండదు.

మతం సృష్టించింది మనిషే కానీ ప్రకృతి కాదు అని గ్రహించాల్సిన సమయం వచ్చింది.
” మతములన్నీ మాసిపోవును,
మానవత్వం ఒక్కటే విలసిల్లును”
విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend