నాని మళ్ళీ కొడతాడట

యువ హీరో నాని గత రెండు సంవత్సరాలుగా వరుసగా సక్సెస్‌లు వస్తుండటంతో సినిమా సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ పోతున్నాడు. ‘నేను లోకల్‌’ చిత్రంతో నాని కెరీర్‌లో బెస్ట్‌ కలెక్షన్స్‌ను రాబట్టాడు. ఆ సినిమా తర్వాత నాని చేసిన చిత్రం ‘నిన్ను కోరి’. నాని ఈ చిత్రంలో నివేదా థామస్‌తో రొమాన్స్‌ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జెంటిల్‌మన్‌’ సక్సెస్‌ అయ్యింది. దాంతో ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మంతో ప్రేక్షకులు ఉన్నారు.

ఇటీవలే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లు సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. ట్రైలర్‌ చూడగానే సినిమాను ఇంకా ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపించింది అంటూ స్వయంగా రాజమౌళి అనడంతో సినిమా స్థాయి ఆకాశానికి తాకింది. నాని ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం నాని ‘నిన్ను కోరి’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీ అయ్యాడు.

ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే సెన్సార్‌ ముందుకు వెళ్లిన ఈ చిత్రానికి క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ దక్కింది. ఒక ట్రైయాంగిల్‌ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా నాని కెరీర్‌లో మరో మంచి చిత్రంగా నిలుస్తుందా లేక ఒక సాదా సీదా చిత్రంగా ఉంటుందా అనేది తెలియాలంటే ఈ నెల 7 వరకు ఆగాల్సిందే.

To Top

Send this to a friend