సింహాను వదల్లేక పోతున్న బాలయ్య!


నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘నరసింహ నాయుడు’, ‘సమరసింహారెడ్డి’, ‘సీమసింహం’, ‘లక్ష్మి నరసింహా’, ‘సింహా’ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ చిత్రాల్లో కామన్‌గా ఉన్న పదం సింహ. అందుకే సెంటిమెంట్‌గా బాలయ్య సింహా పదాన్ని తన తర్వాత సినిమాకు పెట్టాలని భావిస్తున్నాడు. పూరి సినిమాకే సింహా పదం కలిసి రావాలని కోరుకున్నాడు. కాని పూరి మాత్రం ‘పైసా వసూల్‌’ అంటూ టైటిల్‌ను ఖరారు చేశాడు. కథకు తగ్గట్లుగా ఆ టైటిల్‌ అయితే బాగుంటుందని దర్శకుడు పూరి ఒప్పించడంతో బాలయ్య కన్విన్స్‌ అయ్యాడు. అయితే తన తర్వాత సినిమాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సింహా పదం కలిసి రావాల్సిందే అని బాలయ్య భావిస్తున్నాడు.

బాలయ్య ప్రస్తుతం పూరి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 101వది కాగా, 102వ చిత్రాన్ని తమిళ దర్శకుడు రవికుమార్‌ దర్శకత్వంలో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. అందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. వచ్చే నెలలోనే షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమాను సి కళ్యాణ్‌ నిర్మించబోతున్నాడు.

ఇప్పటికే సి కళ్యాణ్‌ తన బ్యానర్‌లో ‘రెడ్డిగారు’, ‘జయసింహా’ టైటిల్స్‌ను రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. ఈ రెండు టైటిల్స్‌లో ‘జయసింహా’ వైపే బాలయ్య ఆసక్తి చూపుతున్నాడు. సినిమా షూటింగ్‌ ప్రారంభం సమయంలోనే చిత్ర టైటిల్‌ను ఖరారు చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. అందుకోసం తుది చర్చలు జరుగుతున్నాయి.

To Top

Send this to a friend