నరేంద్రమోదీ ముస్లింలకు శత్రువా లేక మిత్రుడా ?

నరేంద్రమోదీ ముస్లింల పట్ల కఠిన వైఖరి ప్రదర్శిస్తారు అనే విషయం ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా అని పరిశీలిద్దాం.

✡నరేంద్రమోదీ భారత ముస్లింలు మరింతగా ఆధునిక ప్రపంచంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.

🔯భారతీయ ముస్లింల వెనుకబాటుతనం కి కారణం అవిద్య అని,ఆ సమస్య పరిష్కరించ డానికి నరేంద్రమోదీ నడుం బిగించారు. ముస్లింలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇస్తున్న వివిధ పథకాల గురించి తెలుసుకోండి.

✡నయీ రోష్ని – మైనారిటీ మహిళల నాయకత్వ అభివృద్ధికి పథకం .

🔯నయీ మన్ జిల్ – మైనారిటీ వర్గాల కోసం ఒక సమగ్ర విద్య మరియు జీవనోపాధి చొరవ .

✡నయీ ఉడాన్ – UPSC, State PSC మరియు SSC నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష క్లియరింగ్ మైనారిటీ విద్యార్థులకు మద్దతు .

🔯సీఖో ఔర్ కమావో (నేర్చుకోండి & సంపాదించండి) – మైనారిటీల నైపుణ్యం అభివృద్ధి కోసం పథకం .

✡హమారీ ధరోహర్ – భారతీయ సంస్కృతి యొక్క మొత్తం భావనలో భారతదేశ మైనారిటీ వర్గాల గొప్ప వారసత్వాన్ని పరిరక్షించే పథకం.

🔯ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం

✡పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం

🔯మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్‌షిప్ పథకం .

🔯మైనారిటీ విద్యార్థుల కోసం మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్.

✡పడో పరదేశ్ – మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం విదేశీ అధ్యయనాల కోసం విద్యా రుణాలపై వడ్డీ రాయితీ పథకం .

🔯గత UPA 2 కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా 2014-19 మధ్య NDA ప్రభుత్వం ముస్లింల విద్య పై ఎక్కువ ఖర్చు పెట్టింది. 10 వ తరగతి దాటిన వారి విద్య కోసం గతం లో ఒక్కొక్కరికి,సంవత్సరానికి గతంలో ₹22,000 ఖర్చు పెడితే,ఇప్పుడు ఆ మొత్తం ₹26,000 లకు పెంచారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం లో 2.33 కోట్ల మంది ముస్లిం విద్యార్థుల కు స్కాలర్ షిప్ లు ఇస్తే , బీజేపీ ప్రభుత్వం 2.37 కోట్ల మందికి స్కాలర్ షిప్ లు ఇచ్చింది. 2019 -2024 మధ్య కాలంలో 5 కోట్ల మందికి స్కాలర్ షిప్ లు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో 50% ముస్లిం బాలికలకు తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ణయించారు.

✡ మదరసాలలో విద్య ను అభ్యసించే విద్యార్థులకు సైన్స్, గణితం,కంప్యూటర్ వంటి సబ్జెక్ట్ లు బోధించడానికి ప్రత్యేక బోధనా సిబ్బందిని నియమించారు.

🔯ఈ దేశంలో ముస్లిం మహిళలు బురఖా ధరించాలి అని కానీ, వాహనాలు నడపడానికి అడ్డంకులు కానీ,డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కానీ ,విద్య,ఉపాధి ఇత్యాది విషయాలలో ఎటువంటి అడ్డంకులు లేని స్వేచ్ఛ ఈ దేశం కల్పిస్తోంది.

త్రిపుల్ తలాక్ రద్దు కూడా భారతీయ ముస్లిం మహిళలకు రక్షణ కోసం చేసిన చట్టం గానే భావించాలి తప్ప మత విషయాలలో జోక్యం గా చూడరాదు.

గత కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలను ఓటు బ్యాంకు లుగా చూడడం తప్ప ఒరగబెట్టింది పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు భారతీయ ముస్లింలు తమ అభివృద్ధి పై దృష్టి సారించాలి. దానికి ఏమి చేయాలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి ముందుంచాలి.
ప్రపంచంలో భారతీయ ముస్లింలు ఆదర్శంగా నిలవాలి.
విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend