నారాయణ,శ్రీచైతన్య.. మాకెందుకీ ఖర్మ..

అంధ్రా , తెలంగాణ ల నుంచి వచ్చే పిల్లలు రాటన్ మెధడ్ తో తప్ప లాజిక్ ఉపయోగించి చదివేవారు కావని ఇటీవల చేసిన ఓ సర్వేలో వెల్లడైందట..వారు బట్టీ పట్టి చదివి పాస్ అవుతున్నారని.. పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవడంలో.. నిత్యజీవితంలో సవాళ్లు, ఇతర తెలివి తేటల విషయంలో ఆ విద్యార్థులు మెరుగ్గా లేరని తేలింది.. నారాయణ, చైతన్యలో చదివాక పై చదువుల్లో ఆ విద్యార్థులు.. కేవలం ఓ 10 శాతం … మొదటి సంవత్సరం 90% మందికి బాక్ లాగ్స్ ఉంటాయి…

చైతన్య నారాయణ లు పిల్లల సృజనాత్మకతను నాశనం చేస్తున్నాయని సర్వేలో తేల్చారు. ఇంకో రెండు తరాలు పోతే మీ పిల్లలు ఎందుకూ పనికిరారట… అందంతా మానుపులేషన్ చదువులేనట.. దాన్నే గొప్ప అనే భావజాలంలోకి తీసుకుపోయి డబ్బు దండుకుంటున్నట్టు తెలిసింది.

SSC తర్వాత ఇంటర్మీడియట్ లో MPC లేదా Bipc మాత్రమే చదివాలి మిగతా గ్రూపులు ఐనా CEC,HEC లు అసలు గ్రూప్ లే కానట్టు..వాటిని తీసుకున్నవాడు వాడు చదువే రాని మొద్దు అన్నట్టు ఒక వాతావరణాన్ని గత 20 ఏళ్ల నుండి సృష్టించింది ఈ నారాయణ -చైతన్య విద్యా సంస్థలే…!! వీళ్ళ కాలేజీ లో CEC,HEC గ్రూప్ లే ఉండవు….ఈmpc ,bipc పైత్యం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది..మన పక్క రాష్ట్రాల్లో ఆర్ట్స్ గ్రూప్స్ కి కూడా సమాన ప్రాధాన్యత ఉంది…ఇక్కడ మాత్రం మొద్దు పిల్లలు చదివే గ్రూప్ లు గా ముద్ర వేశారు …మళ్ళీ ఇదే విద్యా సంస్థలు ఇప్పుడు కళ్ళు తెరచి IAS academy branches ని ఓపెన్ చేసి ఇంటర్మీడియట్ స్థాయి నుండి అందిస్తమని చెబుతున్నాయ్ .. …సివిల్స్ ప్రిపరేషన్ లో ఆర్ట్స్ సబ్జక్ట్స్ యే కీలకం … ఇప్పుడు ఆర్ట్స్ సబ్జక్ట్స్ ని వీళ్ళు బోధిస్తున్నారు ….

మన ప్రైవేటు స్కూల్లలో నూటికి తొంభైతొమ్మిది శాతం మార్కులు వచ్చినప్పుడే ఆ విద్యావిధానం భ్రష్టుపట్టిపోయింది.. ఒకప్పుడు పదవ తరగతిలో 60% అంటే ఫస్టు క్లాసు అని అది వస్తే పండగ, అలాంటి కొద్ది మందిని మాత్రమే ఇంటర్ లో MPC, BiPC ఆ తరువాత ఇంజనీరింగు గట్రా, పోనీ తక్కువ మార్కులు వచ్చిన వారిని అలా వదిలేసారా అంటే అదీ లేదు కామర్సు, ఆర్ట్సు డిగ్రీ పాస్ అవ్వటమే గగనం. అలాంటి విద్యావిధానంలోంచి బయటకి వచ్చిన వాళ్ళకి విషయాలపై వుండే అవగాహన చాలా ఎక్కువ. మరి ఇప్పుడు 95% వచ్చినా ఏమీ రాని దద్దమ్మలుగా మిగిలిపోతున్నారు. లోకజ్ఞానం ఉన్న రోహిత్ లు తయారవుతున్నారంటే దానికి మొదటి కారణం విద్యా వ్యవస్థే. ముందుగా మార్చవలసింది పరీక్షావిధానం ఎవ్వరికీ 70% మించి రాకుండా పరీక్షలు పెట్టాలి. దానికి మన చైతన్య, నారాయణలు వ్యతిరేకం. అందుకే మన చదువులు అలా తగలబడ్డాయి..

To Top

Send this to a friend