ఎరక్కపోయి తన్ని కాలు విరగ్గొట్టుకున్న నారాయణ

 

నారాయణ తన కమ్యూనిజాన్ని చూపారు. పోరాట యోధుడిలా ఆక్రమిత భూముల గోడలు బద్దలు కొట్టబోయి చిక్కుల్లో పడ్డారు. ఆదివారం విశాఖలోని ఆక్రమిత భూముల పరిశీలనకు వెళ్లిన నారాయణ ఆ భూముల్లో పెట్టిన గోడను తన్నారు. అది పడలేదు. మళ్లీ కొట్టారు. చివరకు గోడ కూలింది. కానీ తన్నిన నారాయణ మీద కూలింది. దీంతో అత్యుత్సాహంతో తన్నిన నారాయణ .. ఇప్పుడు కాలు విరిగి ఆస్పత్రిలో పడ్డారు.

నారాయణ అత్యుత్సాహం ఆయన్ను ఆస్పత్రి పాలు చేసింది. విశాఖలోని కొమ్మాదిలో ఆక్రమిత భూముల్లో భవనాలు కూల్చేద్దామని వెళ్లిన సీపీఐ నాయకులు ఇది ఊహించని షాక్ తగిలింది. నారాయణ కూల్చబోయి కాలు విరగ్గొట్టుకోవడంతో సీపీఐ నాయకులు హతాషులయ్యారు. వెంటనే నారాయణను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కాలుకు పాక్చర్ అయినట్టు వైద్యులు తేల్చారు.

To Top

Send this to a friend