`డ్ర‌గ్స్‌` నేప‌థ్యంలో న‌య‌న్ `వాసుకి`!

 

 

`డ్ర‌గ్స్‌` వ్య‌వ‌హారంలో టాలీవుడ్ ప‌రేషాన్ అవుతోంది. `డ్ర‌గ్స్` డీల్‌తో సంబంధం ఉన్న‌ కొంద‌రు యువ‌హీరోలు, హీరోయిన్‌లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు `సిట్‌` ముందు విచార‌ణ‌కు రెడీ అవుతున్నారు. స‌రిగ్గా ఇలాంటి టైమ్‌లోనే క‌థానాయిక భావ‌న కిడ్నాప్‌, అత్యాచారం ఉదంతంలో హీరో దిలీప్ అరెస్టు మాలీవుడ్‌లో ప్ర‌కంప‌నాలు రేపుతోంది. రెండు ప‌రిశ్ర‌మ‌ల్లో ఒక‌టే క‌ల్లోలం. అయితే ఈ రెండు ప‌రిశ్ర‌మ‌ల‌తో ముడిప‌డి .. ఇదే త‌ర‌హా ఉదంతాల‌తో సంబంధం ఉన్న క‌థాంశంతో న‌య‌న‌తార క‌థానాయిక న‌టించిన‌ ఓ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవ్వ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `పుదియ నియ‌మం` తెలుగులో `వాసుకి`గా రిలీజవుతోంది. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ సినిమా క‌థాంశం డ్ర‌గ్స్, అత్యాచారం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. డ్ర‌గ్స్ బాధితులైన కొంద‌రు యువ‌కులు ఎలాంటి అఘాయిత్యం చేశారో తెర‌పై చూడాల్సిందేన‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఇక‌పోతే `డ్ర‌గ్స్‌`కి బానిస‌లైన వాళ్లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు? అన్న‌ది ఈ సినిమాలో అద్భుతంగా పిక్చ‌రైజ్ చేశారు. మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఈ సినిమాని, త్వ‌ర‌లోనే తెలుగులో భారీగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

To Top

Send this to a friend