వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన నాని

నేచురల్ స్టార్ కు కోపం వచ్చింది.. వచ్చింది ఎవరిమీదో కాదు.. ఆయన ఫ్యాన్స్ మీదే.. తన గురించి కాకుండా పక్కనున్న హీరోల గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాయడంతో నాని కోపోద్రిక్తుడయ్యాడు.. నాని సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పుడూ ట్విట్టర్ ఫేస్ బుక్ ల ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటాడు. తన కొత్త సినిమా విశేషాలు, కబుర్లు అభిమానులతో పంచుకుంటాడు. తన పేరిట ఉన్న ఫ్యాన్స్ పేజీల పోస్టులను కూడా షేర్ చేస్తుంటాడు.

ఇటీవల నానికి ఓ పోస్టు కంట పడింది. ఆ పేజీ నాని పేరుతోనే ఉంది. పేజీలో నానిని పొగుడుతూ మరో హీరోను తిడుతూ పోస్టు పెట్టారు. ఇది చూసిన నాని తన ఫ్యాన్స్ కు హెచ్చరికలు పంపాడు. తన పేరు, తన ఫ్రొఫైల్ పిక్ ను పెట్టుకొని ఇతర హీరోలను కించపరిస్తే ఊరుకోనని.. మీ తీరు భాష మార్చుకోండి లేదంటే నా పేరు, నా ఫొటో తీసేసి ఏమైనా రాసుకోండని అభిమానులు హెచ్చరించాడు.. ఇలా నాని తనతో పాటు పక్క హీరోలను గౌరవించడంపై టాలీవుడ్ అందరూ మెచ్చుకుంటున్నారు.

తెలుగుతెరపై అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ అభిమానులను సంపాదించుకున్న నాని అంటే ఇష్టపడని వారు ఉండవు.. ఇంటా బయటా కూడా నాని చాలా జోవియల్ గా ఉంటాడని టాక్. అందరు హీరోల ఫంక్షన్ కు వెళ్లే నాని పేజీలో ఇతర హీరోలను విమర్శిస్తే చెడ్డపేరు వస్తుందని భావించి ఏకంగా తన ఫ్యాన్స్ కు హెచ్చరికలు పంపాడు.. తన పేజీలో తనను మెచ్చుకోకున్నా పర్లేదు కానీ ఇతర హీరోలను తిట్టవద్దని ఫ్యాన్స్ కు సూచించాడు.

To Top

Send this to a friend