నాని ‘నిన్నుకోరి’ అర్థం కాలేదు

‘నేను లోకల్‌’ చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న నాచురల్‌ స్టార్‌ నాని తాజాగా ‘నిన్ను కోరి’ చిత్రంలో నటించాడు. ఈ సినిమాపై మొదటి నుండి కూడా భారీ అంచనాలున్నాయి. నాని వరుసగా సక్సెస్‌లు దక్కించుకుంటూ వస్తుండటంతో పాటు, ఈ సినిమా విభిన్న ప్రేమ కథతో తెరకెక్కుతుందని చెప్పడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నానితో పాటు మరో హీరో ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో కనిపించాడు. దాంతో సినిమా స్థాయి మరింతగా పెరింది. సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది.

ఏదైనా ఒక సినిమా టీజర్‌ వస్తుంది అంటే ఆ సినిమా స్టోరీ లైన్‌ ఏంటి, అసలు ఆ సినిమా దేని గురించి అనే ఒక క్లారిటీ వస్తుంది. కాని నాని తాజాగా నటించిన ఈ సినిమా కాస్త విభిన్నంగా ఉంది. టీజర్‌లో ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కారు, అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తా, ఏ అలవాటు లేని వాడిని పెళ్లి చేసుకుంటారు అంటూ నాని చెప్పిన డైలాగ్‌ సినిమా ఎలా ఉండబోతుందో అర్థం కాకుండా ఉంది. అయితే ఈ డైలాగ్‌తో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతుంది.

ఇదో ట్రైయాంగిల్‌ ప్రేమ కథ అయ్యి ఉంటుందని, నాని, నివేదా థామస్‌ల మద్య ఆది ఉంటాడని, చివరకు ప్రేమ ఏమైంది అనేది ఆసక్తికర విషయం. నాని ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను కొట్టేలాగే అనిపిస్తుంది. టీజర్‌తో ఏమీ అర్థం కాని నాని చిత్రం, ట్రైలర్‌తో క్లారిటీ వస్తుందేమో చూడాలి. సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

To Top

Send this to a friend