సవాల్: అఖిలప్రియ, శిల్పాల రాజీనామాస్త్రాలు..

బస్తీ మే సవాల్.. నంద్యాల ఉపఎన్నిక సాక్షిగా మరోసారి టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలాయి. టీడీపీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన అఖిలప్రియ నంద్యాలలో టీడీపీ ఓడిపోతే రాజీనామా చేస్తానని.. ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. దీనికి ధీటుగా బదులిచ్చిన వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సైతం సవాల్ ను స్వీకరించారు.

నంద్యాల ఉప ఎన్నిక విషయంలో టీడీపీ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని.. వైసీపీ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. నంద్యాలలో భూమా కూతురు లేదా కుమారుడు పోటీ చేసి ఉంటే వైసీపీ సంప్రదాయం ప్రకారం పోటీపెట్టకుండా ఉంచేదని.. కానీ ఇప్పుడు వేరే అభ్యర్థి నిలబడడంతో పోటీచేస్తున్నామని స్పష్టం చేశారు.

నంద్యాల ఉప ఎన్నిక గుబులు రేపుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు మొదలయ్యాయి. టీడీపీ తరఫున మంత్రి అఖిలప్రియ, వైసీపీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవడానికి పోరాటం చేస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి టీడీపీలో ఉండడం శిల్పాకు మింగుడుపడడం లేదు. ఉప ఎన్నికలు నెలలోపే ఉండడంతో ఎవరికి విజయం వరిస్తుందా అన్న టెన్షన్ మొదలైంది.

To Top

Send this to a friend