నంద్యాలలో వైసీపీపై టీడీపీదే గెలుపు..

నంద్యాల ఉప ఎన్నికల్లో ఊహించని ఫలితం వచ్చింది. అంతా ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలుస్తాడని విస్తృత ప్రచారం జరిగినా.. అధికార టీడీపీ పార్టీయే ఈ స్థానాన్ని గెలుచుకోవడం విశేషం. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందారెడ్డి భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి శిల్పాపై ఘనవిజయం సాధించారు. ఎవ్వరూ ఊహించని విధంగా దాదాపు 27466 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించడం విశేషం.

ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో మొత్తం 142628 ఓట్లకు గాను 105484 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థికి 56శాతం ఓట్లు రావడం గమనార్హం. భూమాకు 97076 ఓట్లు, వైసీపీ అభ్యర్థి శిల్పాకు 69610ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 1382ఓట్లు మాత్రమే వచ్చాయి.

* పార్టీలకు వచ్చిన ఓట్లు
-టీడీపీ – 97,106,
-వైసీపీ – 69,710,
– కాంగ్రెస్ – 1,153

* పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం..
టీడీపీ సాధించిన ఓట్ల శాతం- 56.06%
వైసీపీ సాధించిన ఓట్ల శాతం – 40.25%
కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతం – 0.66%

To Top

Send this to a friend