బాబు ప్లాన్ ఫెయిల్.. శిల్పా సేఫ్..

టీడీపీ వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ తరఫున నంద్యాల ఉప ఎన్నికల బరిలో నిలబడ్డ శిల్పా చక్రపాణి రెడ్డి నిన్న నామినేషన్ వేశారు. అయితే అఫిడవిట్ తయారు చేసిన లాయర్ కు ప్రభుత్వ గుర్తింపు లేదని.. ఆ నామినేషన్ ను తిరస్కరించాలని టీడీపీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో శిల్పా నామినేషన్ రద్దు అవుతుందా అన్న తొందరలో వైఎస్ జగన్ శిల్పా కొడుకుతో కూడా మరో నామినేషన్ వేయించారు.

రిజిస్టార్ లాయర్ కు ప్రభుత్వ గుర్తింపు లేదనే కారణంతో వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా ప్లాన్ చేసిన టీడీపీ వ్యూహాలు దెబ్బతిన్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వైసీపీ అభ్యర్థి శిల్పా నామినేషన్ ను ఆమోదించడంతో ఇక ఆయన వైసీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు..

డైరెక్టుగా ఎదుర్కొనే దమ్ము లేని టీడీపీ, వైసీపీని దొంగదెబ్బ తీయాలని చూసింది. ఎన్నికల అఫిడవిట్ లో లాయర్ కు గుర్తింపు లేదని నామినేషన్ తిరస్కరించాలని శతథా ప్రయత్నించినా అది సఫలం కాలేదు. దీంతో ఎన్నికలకు ముందే వైసీపీ అభ్యర్థి శిల్పాను బరిలోంచి తప్పించాలనుకున్న చంద్రబాబుకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.

To Top

Send this to a friend