శ్రీ కృష్ణ, నందమూరి తారకరత్నల కొత్త సినిమా ..

ఒకేసారి తొమ్మిది సినిమాలు ప్రారంభించి తెలుగు చిత్ర సీమలో సంచలనం తో అడుగుపెట్టి తనదైన విలక్షణ నటనతో హీరోగా,విలన్ గా మెప్పించిన నటుడు నందమూరి తారకరత్న. ఒకటో నెంబర్ కుర్రడుగా పాపులర్ అయిన తారక రత్న, అమరావతి సినిమాలో విలన్ పాత్రతో అందరిని మెప్పించాడు. ఇప్పుడు మళ్ళి హీరోగా ఒక కొత్త దర్శకుడితో మంచి కధతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

నూతన దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె దర్సకత్వంలో అతి త్వరలో సినిమా ప్రారంభం కాబోతుంది. త్వరలో ఈ సినిమాకి సంభందించిన పూర్తి వివరాలను నటి నటుల వివరాలను ప్రకటించనున్నారు. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాకి దర్సకత్వంతో పాటు కదా కధనం కూడా అందిస్తున్నారు శ్రీకృష్ణ.

To Top

Send this to a friend