సెట్ లో కొట్టి బాలయ్య దొరికిపోయాడు..

తెలుగులో స్టార్ హీరో బాలక్రిష్ణ, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై ప్రజాసేవ చేస్తున్నాడు. పెద్ద హీరోగా, ప్రజాప్రతినిధిగా ఎంత ఓర్పు నేర్పుతో ఉండాలి. కానీ బాలయ్యలో ఆ లక్షణాలు మచ్చుకు కూడా లేవు. అదే అహం, టెంపరితనం, కోపం కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం,.. అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారని కాంట్రవర్సీ మాటలు మాట్లాడి అనక నాలుక కరుచుకొని సారీ చెప్పిన బాలయ్య ఇప్పుడు మరోసారి తన అహాన్ని బయటపెట్టి వివాదాన్ని కొనితెచ్చుకున్నారు.

నట సింహం ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే బాలక్రిష్ణ.. సినిమాల్లోనే కాదు.. బయట కూడా తన విశ్వరూపాన్ని చూపించడం విస్మయం కలిగించింది. . ఇప్పటి వరకు వాళ్లూ వీళ్లూ చెబితే వినటమేగానీ.. ఇప్పుడు మాత్రం అందరికీ చూపించేశారు నందమూరి బాలకృష్ణ. 102వ మూవీకి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో జరిగింది. దేవుడికి పూజ చేయటానికి రెడీ అయ్యారు హీరో. ఇక్కడే అందరికీ దొరికిపోయారు.

గురువారం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ టైంలో అసిస్టెంట్ పై బాలక్రిష్ణ చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. కాళ్లకు ఉన్న షూ తీయలేదని నెత్తిన ఒక్కటి పీకారు. ఆ టైంలో హీరోలోని ఆవేశం, అసహనం స్పష్టంగా కనిపించాయి.

పూజకు వెళుతూ నిల్చొన్న బాలయ్య.. కాళ్లకు ఉన్న షూను తీయలేదని అసిస్టెంట్ పై చేయి చేసుకున్నారు. ఈ వీడియో బయటకు రావటంతో.. నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. హీరో అయితే కొడతాడా.. అసిస్టెంట్లను బాలయ్య ఇలా కొడతారా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసిస్టెంట్ పై చేయి చేసుకున్న బాలయ్య విజువల్స్ ఇప్పుడు బాలయ్యపై ఆగ్రహావేశాలకు కారణమవుతోంది.

బాలయ్య తన అసిస్టెంట్ ను కొట్టిన వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend