జగన్ ను లోపలేస్తాం..


ఈరోజు నిర్వహించే వైసీపీ ప్లీనరీ నేపథ్యంలో జగన్ తన అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. పార్టీ ప్లీనరీ నేపథ్యంలో గైర్హాజరయ్యారని.. ఇందుకు అనుమతించాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోరుకు చేసిన విజ్ఞప్తిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కోర్టు విచారణ ఉందని తెలిసీ.. పార్టీ ప్లీనరీ పేరుతో గైర్హాజరు అయితే ఎలా..? శనివారం ఉంటే శుక్రవారం కోర్టుకు ఎందుకు రాలేందంటూ జడ్జి మండిపడ్డారు.. ఇలాగైతే విచారణ ముందుకు సాగదని.. వ్యక్తిగత హాజరు లేకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని ’ జగన్ కు జడ్జి హెచ్చరికలు జారీ చేశారు.

అయితే జగన్ తరఫు లాయర్లు.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని జడ్జికి విజ్ఞప్తి చేయడంతో ఈ ఒక్కసారికి అనుమతిస్తున్నట్టు జడ్జి వెల్లడించారు. లేకపోతే జగన్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేదే..

ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో జగన్ ఎంపీ విజయసాయి రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, శ్రీలక్ష్మీ, మురళీధర్ రెడ్డితో పాటు పారిశ్రామిక వేత్తలు కూడా కోర్టు హాజరయ్యారు.

To Top

Send this to a friend